Webdunia - Bharat's app for daily news and videos

Install App

భళ్లాలదేవుడికి సంకెళ్లు వేసిన తేజ... 'నేనే రాజు నేనే మంత్రి' డైలాగ్ అదిరింది...

బాహుబలి చిత్రంలో భళ్లాల దేవుడు పాత్రలో రానాను చూస్తే చిన్నపిల్లలు లాగులు తడుపుకుంటారు. అలాంటి భళ్లాల దేవుడు ఇప్పుడు కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. అది కూడా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న దర్శకుడితో. ఆ దర్శకుడు మరెవరో కాదు చిత్రం, నువ్వు-నేను, జయం వంటి చి

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (15:25 IST)
బాహుబలి చిత్రంలో భళ్లాల దేవుడు పాత్రలో రానాను చూస్తే చిన్నపిల్లలు లాగులు తడుపుకుంటారు. అలాంటి భళ్లాల దేవుడు ఇప్పుడు కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. అది కూడా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న దర్శకుడితో. ఆ దర్శకుడు మరెవరో కాదు చిత్రం, నువ్వు-నేను, జయం వంటి చిత్రాలతో సక్సెస్ కొట్టిన దర్శకుడు తేజ. ఇటీవలి కాలంలో ఏ చిత్రం చేసినా చేతులు కాలుతూ వున్నాయి తప్పించి పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ నేపధ్యంలో ఆయనకు సూపర్ సక్సెస్ లో వున్న రానా అవకాశం ఇవ్వడం విశేషమే. 
 
రానాతో తీస్తున్న చిత్రం పేరు నేనే రాజు నేనే మంత్రి అని నామకరణం చేశారు. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. దివంగత నిర్మాత రామానాయుడు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం తాలూకు టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్లో రానాకు సంకెళ్లు వేసి వున్నాయి. జైల్లోకి వెళుతున్న రానా.. . నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా... నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా అంటూ డైలాగ్ చెప్తాడు. ఈ డైలాగులు చూస్తుంటే భళ్లాలదేవ రానా తదుపరి చిత్రం పైన భారీ అంచనాలే నెలకొని వున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments