Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేహా ధూపియాకు యాక్సిడెంట్... కాపాడటం మానేసి, సెల్ఫీలకు ఎగబడిన జనం!

టాలీవుడ్ హీరో బాలకృష్ణ నటించిన "పరమవీరచక్ర" చిత్రంలో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ నటి నేహా ధూపియా ఒకరు. ఈమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ విషయం ఆ ప్రాంత వాసులకు తెలియడంతో ఒక్కసారిగా జనం భ

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (11:29 IST)
టాలీవుడ్ హీరో బాలకృష్ణ నటించిన "పరమవీరచక్ర" చిత్రంలో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ నటి నేహా ధూపియా ఒకరు. ఈమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ విషయం ఆ ప్రాంత వాసులకు తెలియడంతో ఒక్కసారిగా జనం భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. వీరంతా ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించకుండా నటి నేహాతో సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చండీగఢ్‌లో ఓ ఆడియో ఫంక్షన్‌కు వెళ్లి, తిరిగి వస్తున్న సమయంలో నేహా ధూపియా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. బ్రేకులు పని చేయకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందింది. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలు కాకపోయినా, ఆమె కళ్లద్దాలు పగిలిపోయాయి. రోడ్డు మధ్యన ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో, రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. 
 
కారులో ఉన్నవారికి సాయం చేయడానికి వెళ్లినవారు... అందులో ఉన్న నేహా ధూపియాను గుర్తు పట్టారు. అంతే... అక్కడున్న జనాలంతా ఆమె పరిస్థితిని పట్టించుకోకుండా, ఆమెతో సెల్ఫీలకు ఎగబడ్డారు. దీంతో ఆమె చాలా ఇబ్బందికి గురయింది. ఓ అర్థగంట సేపు వారికి సెల్పీలతో పాటు, ఆటోగ్రాఫ్‌లు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత వేరే కారు రావడంతో... బతుకుజీవుడా అంటూ ఆమె ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

ఈపీఎఫ్‍‌వో వెర్షన్ 3.0తో సేవలు మరింత సులభతరం : కేంద్ర మంత్రి మాండవీయ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments