Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? ఆ పాటకు 100 మిలియన్ వ్యూస్

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (16:16 IST)
Neeli Neeli Aakasam
యాంకర్ ప్రదీప్ గురించి అందరికీ బాగా తెలుసు. బుల్లితెరపై అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఇంకా సినిమాల్లో కనిపించిన ప్రదీప్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో కూడా నటించాడు. ప్రస్తుతం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ప్రదీప్. ఈ సినిమా నుండి వచ్చిన నీలి నీలి ఆకాశం సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  ఈ సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది. 
 
అనూప్ రూబెన్స్ మ్యూజిక్ చంద్రబోస్ సాహిత్యం రెండు ఈ పాటకు బాగా కుదిరాయి. అందుకే ఈ ఒక్క పాటతో సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది. ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మున్నా దర్శకుడు. నిజానికి మార్చి 25న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా ప్రభావంతో వాయిదా పడింది. 
 
ఇప్పటికే షూటింగ్‌లు క్యాన్సిల్ అయిన నేపథ్యంలో సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. 21 రోజుల లాక్ డౌన్ తర్వాత పరిస్థితి అందుబాటులో ఉంటే ఓకే కానీ ఇంకా కొనసాగితే మాత్రం థియేటర్ల బంద్ కూడా పొడిగిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ప్రదీప్ హీరోగా వస్తున్న ఈ సినిమా ఇతర హీరోలతో పోటీపడుతుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లక్షద్వీప్ దీవులలోని ఉపాధ్యాయుల కోసం ఏఐ శిక్షణా కార్యక్రమం

Andhra Pradesh: ఇండియా జస్టిస్ రిపోర్ట్- 2025: రెండో స్థానానికి ఎగబాకిన ఆంధ్రప్రదేశ్

నా స్కూటీ నాకిచ్చేయండి... వా... అంటూ పోలీసుల వద్ద ఏడ్చిన యువతి (video)

Heavy rains: రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు- అలెర్ట్ జారీ

వరుస గుండెపోటు మరణాలు: తెలంగాణ హైకోర్టుకి వెళ్లాలంటే గుండె గుభేల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments