ప్రియుడి కౌగిలిలో నయనతార.. రొమాంటిక్‌ లుక్‌తో పిక్.. నెట్టింట వైరల్

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (09:58 IST)
Nayanthara and Vignesh
దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతారకు ఇప్పటికే నిశ్చితార్థం జరిగిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నయనతార చేతికి ప్లాటినమ్‌ రింగ్‌ ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. ఆ ఫొటోకు 'వేలితో పాటు ప్రాణాన్ని కూడా చేర్చి' అని విఘ్నేష్‌ శివన్‌ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, నయనతార, విఘ్నేష్‌ ఇద్దరికీ నిశ్చితార్థం అయిందని ఆ ఫొటో స్పష్టం చేసింది. 
 
తాజాగా విఘ్నేష్‌ మరో ఫొటోను షేర్‌ చేశారు. ఈస్టర్‌ పండగ సందర్భంగా దిగిన ఫొటో ఇది. ఒకరి కళ్లల్లోకి ఒకరు ప్రేమగా చూస్తున్న ఈ ఫొటోలో మాంచి రొమాంటిక్ లుక్‌లో ఉన్నారు. త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నారని టాక్ నడుస్తోంది.
 
నయనతార గత కొన్నేళ్లుగా విఘ్నేష్‌తో షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లేడీ సూపర్ స్టార్ కి ఇదే చివరి ప్రేమ ప్రయాణమని, ఇక అమ్మడు పెళ్లి పీటలెక్కేస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటీవలే తన ప్రియుడి గుండెల మీద చేయి వేసి దిగిన ఓ పిక్ షేర్ చేస్తూ చేతికి ఉన్న రింగ్‌ను ఫోకస్ చేసింది ఈ అందాలతార. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ప్రియుడి కౌగిలిలో మునిగి రొమాంటిక్ మూడ్‌లో ఉన్న మరో పిక్ చేసింది నయనతార. ఈస్టర్ పండుగ సందర్భంగా ఈ లవ్ బర్డ్స్ ఇలా ప్రేమలో మునిపోయారు. స్వయంగా నయన్.. ఈ పిక్‌ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో వెంటనే వైరల్ అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments