Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క ఫోటోతో విడాకుల వార్తకు చెక్ పెట్టిన నయనతార

ఠాగూర్
శుక్రవారం, 8 మార్చి 2024 (15:32 IST)
ప్రముఖ నటి నయనతార తన వైవాహిక బంధం గురించి వస్తున్న వార్తలకు ఒక్క ఫోటోతో ఫుల్ స్టాప్ పెట్టారు. తాజాగా తన భర్త, సినీ దర్శకుడు విఘ్నేష్ శివన్‌, తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఛార్టెడ్ ఫ్లైట్‌లో ప్రయాణం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆమె షోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోతో తాము విడిపోతున్నట్టు ప్రచారం చేస్తున్న వ్యక్తుల నోళ్ళతో పాటు మీడియా మైకులు కూడా మూయించింది. 
 
ఇటీవల నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటోను షేర్ చేశారు. అప్పటి నుంచి ఈ జంటపై నెట్టింట విడాకుల రూమర్స్ పుట్టుకొచ్చాయి. అయితే, వీటిపై ఇప్పటివరకు ఆమె ఎక్కడా స్పందించలేదు. కానీ, ఈ రూమర్స్ మరింత విస్తరిస్తుండటంతో వాటికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. 
 
అంతే.. లేడీ సూపర్ స్టార్ తాజాగా మరో ఫోటోను షేర్ చేసి అందరి నోళ్లు మూయించారు. భర్త విఘ్నేష్‌తో పాటు తమ పిల్లలతో కలిసి విదేశాకు వెళుతున్న సమయంలో తీసిన ఫోటోను ఆమె షేర్ చేశారు. నయన తన ప్యామిలీతో కలిసి జెడ్డా టూర్‌కు వెళ్లినట్టు సమాచారం. అలా జెడ్డాకు విమానంలో వెళుతున్న సమయంలో తీసిందే ఈ తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో కావడం గమనార్హం. 
 
ఈ ఫోటోకింద... చాలాకాలం తర్వాత ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తున్నా.. అనే క్యాప్షన్ ఇచ్చారామె. దీంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇదిలావుంటే, నయనతార విఘ్నేష్ జంట 2022 జూన్ 9వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత అదే యేడాది అక్టోబరు నెలలో నయనతార దంపతులు సరోగసి విధానం (అద్దె గర్భం)లో ఇద్దరు పిల్లలు పొందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments