Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరుముగన్ విక్రమ్‌తో రొమాన్స్ ఓవర్.. ఇక కలెక్టర్‌గా రెడీ అవుతున్న నయనతార..

మలయాళ భామ నయనతార పేరు వినగానే ఇటు అభిమానులే కాదు దర్శకనిర్మాతలు ఆమెపై ఎంతో ఇష్టాన్ని, అభిమానాన్ని కనబరుస్తారు. నయనతార ఒకవైపు గ్లామర్ చిత్రాలలో నటిస్తూనే మరో వైపు పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటిస్తూ తెలు

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (17:28 IST)
మలయాళ భామ నయనతార పేరు వినగానే ఇటు అభిమానులే కాదు దర్శకనిర్మాతలు ఆమెపై ఎంతో ఇష్టాన్ని, అభిమానాన్ని కనబరుస్తారు. నయనతార ఒకవైపు గ్లామర్ చిత్రాలలో నటిస్తూనే మరో వైపు పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటిస్తూ తెలుగింటి సీతమ్మగా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించింది. కేవలం తెలుగులోనే కాదు తమిళం మలయాళ భాషలలో కూడా ఈ అమ్మడికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
 
ప్రస్తుతం నయనతార కొన్ని బడా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం నయన్ కోలీవుడ్ హీరో కార్తీతో ''కాష్మోరా'' వంటి వినూత్నమైన చిత్రాల్లో నటిస్తూ మరో పక్క విక్రమ్‌తో ఇరుముగన్‌ చిత్రంలోను నటిస్తోంది. ఈ చిత్రంలో నయన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళంలో దర్శకుడు మంజూర్ గోపీ తెరకెక్కిస్తున్న ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఇందులో ఆమె కలెక్టర్‌గా అతిథి పాత్రలో కనిపించనుందట. 
 
పాత్ర నిడివి తక్కువే అయినా సినిమాకు చాలా కీలకంగా వుంటుందని, ఇటీవలే తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది చిత్ర దర్శకుడు మంజూర్ గోపి తెలిపారు. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తైన ఈ సినిమా పట్ల నయన్ ఎంతో నమ్మకంగా ఉందట. కేజేఆర్‌ స్టూడియోస్‌ పతాకంపై కోటపాడి జె రాజేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నీటి సమస్య నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయాలని చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

Jagitial: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ మృతి.. బైకర్ కూడా..?

ఈ శ్వేతవర్ణపు జింకను చూస్తే అదృష్టమేనట! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments