Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

దేవీ
గురువారం, 26 జూన్ 2025 (15:25 IST)
Nayan Sarika
కమిటీ కుర్రోళ్లు దర్శకుడు యదు వంశీ రెండో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందనున్న రెండో  సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న  ప్రతిభావంతుడైన యువ కథానాయకుడు సంగీత్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సంగీత్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. ఇది వరకే నిహారిక  రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారు.
 
ఈ చిత్రంలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక నటిస్తుంది. ఆయ్, క వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన జీ5 వారి హలో వరల్డ్, సోనీ లివ్ వారి బెంచ్ లైఫ్ వంటి వెబ్ సిరీస్‌ల్లో ద్వారా తెలుగు కి పరిచయం అయ్యారు. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.   
 
జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మానస శర్మ రచయితగా.. సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి దర్శకురాలిగా పని చేశారు. తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ రూపొందించనున్న ఈ సినిమాతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా ఆంగేట్రం చేస్తున్నారు. ఇక సంగీత్ శోభన్ విషయానికి వస్తే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో ప్రధాన పాత్రలో నటించారు.
 
నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ కథను అందించగా మహేష్ ఉప్పల కో రైటర్‌గా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments