Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సూప‌ర్ ఓవ‌ర్''తో ప్ర‌వీణ్ వ‌ర్మ‌తో చేసిన జ‌ర్నీని మ‌ర‌చిపోలేం..

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (18:54 IST)
NaveenChandra
తెలుగు వారి హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుని వారికి తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తోన్న తెలుగు ఓటీటీ 'ఆహా'. ఈ అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌టైనింగ్‌ ఛానెల్‌లో జనవరి 22న ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైన చిత్రం ‘సూపర్‌ ఓవర్‌’. ఈ సినిమాను దివంగ‌త ద‌ర్శ‌కుడు‌ ప్రవీణ్‌ వర్మ తెరకెక్కించారు. సుధీర్‌ వర్మ నిర్మాత‌. థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, చాందిని చౌదరి, అజయ్‌, రాకేందు మౌళి తదితరులు ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఈ సినిమా ప్రీమియ‌ర్ షోను బుధ‌వారం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా...
 
సుధీర్ వ‌ర్మ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమాను డైరెక్ట్ చేసిన ప్ర‌వీణ్ వర్మ మ‌న‌ల్ని విడిచిపెట్టి పోవ‌డం చాలా బాధగా ఉంది. ద‌ర్శ‌కుడు కావాల‌నే ప్ర‌వీణ్ వ‌ర్మ సూప‌ర్ ఓవ‌ర్ సినిమాతో పూర్త‌య్యింది. సినిమా విడుద‌ల‌య్యే స‌మ‌యానికి ప్ర‌వీణ్ వ‌ర్మ మ‌న మ‌ధ్య లేడు. సినిమా ప్రేక్ష‌కులకు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది’’ అన్నారు. 
 
రాకేందు మౌళి మాట్లాడుతూ - ‘‘సినిమా ప్రీమియర్ చూసిన అందరికీ తప్పకుండా నచ్చే ఉంటుంది. ప్రవీణ్ వర్మ నన్ను కలిసి కథ నెరేట్ చేసినప్పుడు బాగా నచ్చింది. స్క్రిప్ట్‌లో ఎలా ఉందో అలాగే సినిమాను తెర‌కెక్కించారు. త‌న‌ని ఈరోజు మిస్ కావ‌డం చాలా బాధ‌గా ఉంది. ఆయ‌న‌తో ప‌నిచేయం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్‌. న‌వీన్‌చంద్ర‌, చాందిని చౌద‌రి స‌హా అంద‌రం బెస్ట్ ఇచ్చాం. ప్రేక్ష‌కులు కూడా మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌ని న‌మ్ముతున్నాం’’ అన్నారు. 
 
హీరోయిన్ చాందిని చౌద‌రి మాట్లాడుతూ ‘‘ఇలాంటి ఓ మంచి సినిమాను మాకు ఇచ్చినందుకు ప్ర‌వీణ్ వ‌ర్మ‌కు థాంక్స్ చెప్పాల‌నుకుంటున్నాను. త‌ను పై నుంచి చూస్తుంటాడ‌నుకుంటున్నాను. క్రికెట్ బెట్టింగ్‌పై చాలా డీటెయిల్డ్‌గా తీసిన సినిమా. న‌వీన్ చంద్ర‌, రాకేందు మౌళి అంద‌రం మంచి సినిమా చేశామ‌ని న‌మ్ముతున్నాం. ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న ఆహాకు థాంక్స్‌’’ అన్నారు. 
 
హీరో న‌వీన్ చంద్ర మాట్లాడుతూ - ‘‘ప్రవీణ్ వర్మతో జర్నీ చేసిన నెల రోజులు మరచిపోలేం. తనతో జర్నీ చేసిన కొద్ది రోజుల్లోనే ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. ప్రవీణ్ వర్మ గురించి తెలియని వారు లేరు. తను అంత పాజిటివ్ పర్సన్. రాత్రి వేేళల్లో షూటింగ్స్ చేశాం. ప్రవీణ్ ఆశయాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావ‌డానికి సుధీర్ వ‌ర్మ.. మేం ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డాం. ప్ర‌వీణ్ వ‌ర్మ‌మ‌న‌లో ఉండి మ‌న‌ల్ని చూస్తున్నాడ‌ని అనుకుంటున్నాం. ఈ సినిమా మా అంద‌రికీ స్పెష‌ల్ మూవీ. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులకు సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌ని అనుకుంటున్నాను. ఆహా టీమ్‌కు థాంక్స్‌. సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు’’ అన్నారు. 
 
ఆహా సీఈఓ అజిత్ మాట్లాడుతూ ‘‘సుధీర్ చాలా ఓపికతో సినిమాకను ప్రవీణ్ కోసం పూర్తి చేశాడు. నవీన్ చంద్ర, చాందిని చౌదరి, రాకేందు మౌళి చక్కగా సపోర్ట్ చేశారు. భానుమతి అండ్ రామకృష్ణ‌లో చేసిన న‌వీన్ చంద్, క‌ల‌ర్‌ఫొటోలో చేసిన చాందిని చౌద‌రి కాంబినేష‌న్‌లో చేసిన సినిమా ఇది. ప్ర‌వీణ్ వ‌ర్మ కోసం ఈ సినిమాను అంద‌రూ చూసి స‌పోర్ట్ చేయాల‌ని కోరుతున్నాను. ప్ర‌వీణ్ వ‌ర్మ‌ను ఎంత‌గానో మిస్ అయ్యాం. ప్రేక్ష‌కులు త‌మ ఆశీర్వాదాన్ని అందిస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments