Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాట్యం-లోని -వేణువులో.. పాట‌ను విడుద‌ల చేసిన‌ ర‌వితేజ

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (16:02 IST)
Ravi Teja, Karunakar Adigarla, Sandhyaraju
`నాట్యం`అంటే ఓ క‌థ‌ను డాన్స్ ద్వారా అంద‌మైన రూపంలో చెప్ప‌డ‌మే. అలాంటి ఓ అద్భుత‌మైన‌ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం `నాట్యం`. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా ప‌రిచ‌యం అవుతున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకుడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్, టీజర్, సాంగ్స్‌కి  ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా నాట్యం సినిమా నుండి `వేణువులో చేర‌ని గాలికి సంగీతం లేదు...` అనే పాట‌ను మాస్ మ‌హారాజా ర‌వితేజ విడుద‌ల‌చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
 
క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల సాహిత్యం అందించిన ఈ పాట‌కు  శ్రవణ్ భ‌రద్వాజ్ మంచి ట్యూన్ కంపోజ్ చేశారు.  అనురాగ్ కుల‌క‌ర్ణి శ్రావ్యంగా ఆల‌పించిన ఈ పాట శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటోంది. నాట్యం చిత్రం అక్టోబ‌రు 22న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది.
 
ఈ సినిమాలో కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, సుభలేఖ సుధాకర్, రుక్మిణీ విజయకుమార్, బేబీ దీవెన ముఖ్య పాత్రలు పోషించారు. నిశ్రింకళ ఫిలింస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది.  
 
న‌టీన‌టులు: సంధ్యారాజు, క‌మ‌ల్ కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్‌, ఆదిత్య మీన‌న్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భానుప్రియ‌, బేబీ దీవ‌న త‌దిత‌రులు.
 
సాంకేతిక వ‌ర్గం: స్క్రిప్ట్‌, కెమెరా, ఎడిటింగ్‌, ద‌ర్శ‌కత్వం: రేవంత్ కోరుకొండ‌, సంగీతం: శ్రవణ్ భ‌రద్వాజ్‌, పాటలు: క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌,  ఆర్ట్‌: మ‌హేశ్ ఉప్పుటూరి, వి.ఎఫ్‌.ఎక్స్‌: థండ‌ర్ స్టూడియోస్‌, ఎస్ఎఫ్ఎక్స్‌: సింక్ సినిమాస్‌, సౌండ్ మిక్సింగ్‌: కృష్ణంరాజు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమ వ్యవహారం.. యువకుడిని కత్తులతో పొడిచి హత్య

తెలంగాణ సీనియర్ నేత జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపు!!

సున్నపురాయి గనుల వేలం.. కాస్త టైమివ్వండి.. రేవంత్ విజ్ఞప్తి

తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ

అత్యవసరం ఉంటే తప్పా... ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. పౌరులకు భారత్ హెచ్చరిక!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments