Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండి తెరపై నరేష్ వికె, పవిత్ర లోకేష్ ల మళ్లీ పెళ్లి

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (16:14 IST)
Naresh VK and Pavitra Lokesh
డా.నరేష్ వికె పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్ ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో నరేష్ కు జోడిగా పవిత్రా లోకేష్ నటిస్తున్నారు. మెగా మేకర్ ఎంఎస్ రాజు ఈ చిత్రానికి రచన,  దర్శకత్వం వహిస్తుండగా, నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రంతో లెజెండరీ ప్రొడక్షన్ బ్యానర్ విజయ కృష్ణ మూవీస్‌ను  నరేష్ పున:ప్రారంభించారు.
 
ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మళ్లీ పెళ్లి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్-లుక్ పోస్టర్‌లో ఓ అందమైన ఇంటిముందు పవిత్ర లోకేష్ ముగ్గు వేస్తుండగా సాంప్రదాయ దుస్తులలో నరేష్  ఆ ముగ్గు వేయడాన్ని ఆనందంగా చూస్తూ కనిపించారు.  
 
ఫస్ట్‌లుక్ పోస్టర్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుంది. నరేష్ , పవిత్ర అందమైన కెమిస్ట్రీని ప్రజంట్ చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ ఆకర్షణీయంగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫెంటాస్టిక్ గా వుంది. గ్లింప్స్ పాజిటివ్ వైబ్స్ ని జనరేట్ చేసింది.
 
జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, అరుల్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జునైద్ సిద్ధిక్ ఎడిటర్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాస్కర్ ముదావత్ ప్రొడక్షన్ డిజైనర్.
 ఈ వేసవిలో సినిమాను విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments