Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవిత్రా లోకేశ్ - నరేష్‌లను చెప్పుతో కొట్టబోయిన రమ్య!

Webdunia
సోమవారం, 4 జులై 2022 (10:08 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు నరేష్ నటి పవిత్రా లోకేశ్‌తో కలిసి ఆదివారం బెంగుళూరుకు వెళ్లారు. అక్కడ వారికి అనూహ్య ఘటన ఎదురైంది. వీరిద్దరూ కలిసి వెళుతుండగా, నరేష్ మూడో భార్య రమ్య వారిపై చెప్పుతో దాడి చేసేందుకు యత్నించింది. ముఖ్యంగా పవిత్రా లోకేశ్‌ను చెప్పుతో కొట్టేందుకు రమ్య దూకుడుంగా ప్రయత్నించింది. అయితే, నరేష్, పవిత్రా లోకేశ్‌లకు భద్రతగా వచ్చిన సెక్యూరిటి సిబ్బంది, బౌన్సర్లు రమ్యను అడ్డుకున్నారు. ఇపుడు ఈ దృశ్యాలు టీవీలో హల్చల్ చేస్తున్నాయి.   
 
అదేసమయంలో తన మూడో భార్య రమ్యను మరింత రెచ్చగొట్టేలా నరేష్ నడుచుకున్నారు. ఆమెను చూసి చేయి ఊపుతూ, కామెంట్స్ చేస్తూ వెళ్లిపోయారు. తన భర్తను తనకు కాకుండా పవిత్రా లోకేశ్ చేస్తున్నారని, ఇది అన్యాయమని రమ్య వాపోతోంది. తాము ఇంకా విడాకులు తీసుకోలేదని ఆమె చెపుతోంది, 
 
మరోవైపు, న‌రేష్‌కు అప్పటికే రెండు పెళ్లిళ్లు కాగా... ర‌మ్య ఆయ‌న‌కు మూడో భార్య‌. ర‌మ్య‌తో చాలా కాలంగా దూరంగానే ఉంటున్నారు. తాజాగా ప‌విత్రా లోకేశ్‌తో స‌న్నిహితంగా ఉంటున్నారు. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నట్టు ప్రచారం కూడా సాగుతోంది. 
 
ఈ క్ర‌మంలో ఇటీవ‌లే స్పందించిన న‌రేశ్ త‌మ మ‌ధ్య స్నేహం మాత్ర‌మే ఉందంటూ వ్యాఖ్యానించాడు. ప‌విత్రా లోకేశ్ మాత్రం న‌రేశ్‌కు ఆత్మీయతోడు అవ‌స‌ర‌మ‌ని, కొంత‌కాలంగా అత‌డికి మానసికంగా అండ‌గా నిలుస్తున్నాన‌ని ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న‌ల నేప‌థ్యంలోనే ర‌మ్య వీరిద్ద‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే వారిపై దాడికి య‌త్నించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments