Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా మావయ్య ఇరగదీశాడు... 'గౌతమిపుత్ర శాతకర్ణి'పై నారా లోకేష్ ట్వీట్

సినీ నటుడు బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని బాలయ్య అల్లుడు నారా లోకేష్ తన సతీమణి నారా బ్రహ్మణితో కలిసి వీక్షించారు.

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (11:21 IST)
సినీ నటుడు బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని బాలయ్య అల్లుడు నారా లోకేష్ తన సతీమణి నారా బ్రహ్మణితో కలిసి వీక్షించారు.
 
అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ... ఈ సినిమా ప్రీమియర్ చూసి ముగ్దులమయ్యామని వారన్నారు. ఈ మూవీ ద్వారా అమరావతి గొప్పదనాన్ని తెలుసుకున్నామని, దీన్ని అద్భుతంగా తెరకెక్కించారని, బాలయ్య నటన సూపర్ అంటూ అల్లుడు లోకేష్ ట్వీట్ చేశారు.
 
అలాగే, సినిమా చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. భూతద్దం పెట్టి వెతికినా ఒక్కంటే ఒక్క నెగటివ్ పాయింట్ దొరకడం లేదు. అన్ని పాజిటివ్ పాయింట్స్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'గౌతమీపుత్ర శాతకర్ణి'పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
 
ఓ హాలీవుడ్ చిత్రానికి ఏమాత్రం తీసిపోని లెవల్‌లో 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. యుద్ధ సన్నివేశాల్లో బాలయ్య నటన అద్భుతమని వ్యాఖ్యానిస్తున్నారు. ఒంటిచెత్తో సినిమాని నడిపించాడు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, చిరంథన్ భట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్‌ని పెంచేలా ఉన్నాయని పేర్కొంటున్నారు. 
 
ఇలాంటి ఓ చారిత్రాత్మక చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌లో.. తక్కువ టైంలో ఇంత క్వాలిటీ‌గా.. ఓ హాలీవుడ్ చిత్రానికి ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో తీసిన దర్శకుడు క్రిష్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియా జతకట్టింది. తల్లిగా అలనాటి హీరోయిన్ హేమమాలిని నటించింది. ఈ చిత్రానికి సంగీతం చిరంతన్ భట్. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments