Webdunia - Bharat's app for daily news and videos

Install App

''కృష్ణార్జున యుద్ధం''లో నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయం..

టాలీవుడ్‌ హీరోల్లో నానికి సక్సెస్ రేటు ఎక్కువ. ఇప్ప‌టికే పలు సినిమాలతో డ‌బుల్ హ్య‌ట్రిక్ సాధించిన నాని నిన్నుకోరి చిత్రంతో మ‌రో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్ర

Webdunia
శనివారం, 15 జులై 2017 (11:12 IST)
టాలీవుడ్‌ హీరోల్లో నానికి సక్సెస్ రేటు ఎక్కువ. ఇప్ప‌టికే పలు సినిమాలతో డ‌బుల్ హ్య‌ట్రిక్ సాధించిన నాని నిన్నుకోరి చిత్రంతో మ‌రో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకుడిగా ‘ఎంసీఏ’ సినిమాలో నటించనున్నాడు. దీని తర్వాత మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నుండ‌గా, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ చిత్రంతో త‌నికి మంచి హిట్ ఇచ్చిన హ‌ను రాఘ‌వ‌పూడితో మ‌రో సినిమా చేయ‌నున్నాడు. 
 
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీతో నాని చేసే సినిమా ఆగస్టు నుంచి ప్రారంభం రానుంది. సెప్టెంబరులో సెట్స్‌పైకి వెళ్తుంది. ఇప్పటికే వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న నేచుర‌ల్ స్టార్ నాని.. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకునే సినిమాలో ద్విపాత్రాభినయం పోషిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాకు కృష్ణార్జున యుద్ధం అనే టైటిల్ కూడా సిద్ధమైనట్లు సమాచారం.

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments