Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెంటిల్‌మన్ టీజర్‌కి మంచి స్పందన: రొమాంటిక్ థ్రిల్లర్‌.. 22న పాటలు (Teaser)

Webdunia
శనివారం, 14 మే 2016 (15:41 IST)
నాని హీరోగా నటించిన తాజా చిత్రం జెంటిల్‌మెన్. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 'అష్టా చమ్మా' తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్ర‌మిది. 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా న‌టించారు. ఇటీవ‌ల విడుద‌లైన తొలి టీజ‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా, క‌ల‌ర్‌ఫుల్‌గా సాగిన టీజ‌ర్‌కు వ‌స్తున్న స్పంద‌న చూసి చిత్ర యూనిట్ ఆనందంగా ఉంది. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.... "గురువారం విడుద‌లైన మా టీజ‌ర్ కి చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. ప్ర‌స్తుతం రీరికార్డింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఆయ‌న స‌మ‌కూర్చిన సంగీతం చిత్రానికి హైలైట్ అవుతుంది. ఈ నెల‌ 22న పాట‌ల‌ను విడుద‌ల చేస్తున్నాం. అంద‌మైన రొమాంటిక్ థ్రిల్ల‌ర్ ఇది. అన్ని ర‌కాల భావోద్వేగాలతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులూ చూసేలా ప‌సందుగా ఉంటుంది. జూన్‌లో చిత్రాన్ని విడుద‌ల చేస్తాం"అని అన్నారు. 
 
అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ఆనంద్, రోహిణి, 'సత్యం' రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, కెమేరా: పి.జి. విందా, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డైరెక్టర్: కోట సురేశ్ కుమార్, స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments