Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని వదినగా భూమిక.. మళ్లీ తెలంగాణ అమ్మాయిగా ఫిదా హీరోయిన్

నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబోలో రూపొందుతోన్న ఎంసీఏ సినిమా త్వరలో విడుదల కానుంది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైన సాయిపల్లవి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. శ్

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2017 (12:14 IST)
నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబోలో రూపొందుతోన్న ఎంసీఏ సినిమా త్వరలో విడుదల కానుంది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైన సాయిపల్లవి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా వుంది.
 
ఈ సందర్భంగా నిర్మాతగా దిల్ రాజు మాట్లాడుతూ.. ఎంసీఏ సినిమా డిసెంబర్ 21 ప్రేక్షకుల ముందుకు వస్తోందన్నారు. ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్నామన్నారు. కచ్చితంగా ఎంసీఏ హిట్ కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్య త‌ర‌గ‌తి కుర్రాడిగా నాని నటన ఈ సినిమా హైలైట్ అవుతుందని.. వదిన, మరిది మధ్య అనుబంధంపై ఈ సినిమా వస్తోందన్నారు. 
 
ఇదిలా ఉంటే ఫిదా సినిమాలో తెలంగాణ అమ్మాయిగా అదరగొట్టిన సాయిపల్లవి 'మిడిల్ క్లాస్ అబ్బాయి'లోను తెలంగాణ అమ్మాయిగానే కనిపించనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ సినిమా కథ వరంగల్ నేపథ్యంగా కొనసాగుతుంది. 
 
నాయకా నాయికలు ఇద్దరూ తెలంగాణకి చెందినవారే. అయితే ఒకే తరహా పాత్ర అనిపించకూడదనే ఉద్దేశంతో, తెలంగాణ యాసలో సాయిపల్లవి   మాట్లాడదట. ఫిదా తరహాలోనే ఈ సినిమాలోను తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుందట. ఇక నాని వదినగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments