నాని దసరా క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (16:29 IST)
nani posted still
నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం 'దసరా'  మాస్-అపీలింగ్ ప్రమోషనల్ మెటీరియల్ తో భారీ అంచనాలని సెట్ చేసింది. నాని ఫస్ట్‌ లుక్‌ నుండి ఇటీవలే విడుదలైన ఫస్ట్‌ సాంగ్‌ ధూమ్‌ ధామ్‌ వరకు అద్భుతమైన రెస్పాన్స్‌ తో సినిమా పై క్యూరియాసిటీ ని పెంచేసింది.
 
సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ గోదావరిఖని బొగ్గుగని సెట్‌లో ఈ రోజు ప్రారంభమైంది. పదిహేను రోజుల షెడ్యూల్‌ లో కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్  చిత్రీకరించ నున్నారు. దీన్ని అప్‌డేట్ చేస్తూ నాని ఇన్‌స్టాగ్రామ్‌ లో లొకేషన్ ఫోటో ని పోస్ట్ చేసి "చివరి షెడ్యూల్‌ లో మొదటి రోజు. మనస్సు, శరీరం, హృదయం, ఆవేశం దాని పూర్తి సామర్థ్యంతో" అని రాశారు.
 
ఇది సినిమాలో అత్యంత కీలకమైన సీక్వెన్స్, సినిమాకే హైలైట్‌ గా నిలుస్తుంది. ఈ షెడ్యూల్ తర్వాత, ఒక పాట మాత్రమే షూట్ చేయడానికి మిగిలి ఉంది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జాతీయ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి జోడిగా కనిపించనుంది.
 
సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక  పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

Hayatnagar, ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కల దాడి, చెవిని పీకేసాయి

వరి రైతుల ఖాతాల్లో రూ. 2,830 కోట్లు జమ చేశాం.. నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments