Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ సీజన్ 2 గురించి నాని షాకింగ్ కామెంట్స్

వ‌రుస విజ‌యాలతో దూసుకెళుతోన్న యువ హీరో నాని. నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రం కృష్ణార్జునయుద్ధం. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన కృష్ణార్జున యుద్ధం ఈ నెల 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన నాని పలు ఆస‌

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (22:13 IST)
వ‌రుస విజ‌యాలతో దూసుకెళుతోన్న యువ హీరో నాని. నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రం కృష్ణార్జునయుద్ధం. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన కృష్ణార్జున యుద్ధం ఈ నెల 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన నాని పలు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను పంచుకున్నారు. 
 
రీషూట్స్ ఏమైనా చేసార‌ని అడుగుతుంటారు. అలాంటిదేమీ లేదు. డైరెక్ట‌ర్ క‌థ చెబుతున్న‌ప్పుడు స్టోరీ డిస్కషన్స్‌లో నాకు ఏదైనా నచ్చకపోతే అది నచ్చలేదను చెబుతాను. అంతేగానీ దర్శకుడు స్వేచ్చని హరించేంత క్రియేటివిటీ నాలో లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే... నా స‌క్స‌స్ వెన‌క‌ నా రైటర్స్ - డైరెక్టర్ కృషి ఎంతో ఉంది. వారి క్రెడిటి వారికి ఇవ్వడంలో నాకు ఎలాంటి మొహమాటం లేదు అని చెప్పాడు నాని. 
 
ఇక బిగ్ బాస్ 2 సీజ‌న్‌కి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. దీని గురించి ఏమంటారు అని అడిగితే... బిగ్ బాస్ సీజన్ వన్ తారక్ హోస్ట్‌గా చేయడం - ఆ షో పెద్ద హిట్ అవ్వడం అందరికీ తెలిసిన విషయమే. అయితే బిగ్ బాస్ సీజన్ 2కి నన్ను ఆ ఛానల్ వారు ఎప్రోచ్ అయ్యారని వార్త‌లు వ‌చ్చాయి.

ఈ విషయంపై ప్రస్తుతానికి నేను ఎలాంటి కామెంట్స్ చేయలేను. నన్ను హోస్ట్‌గా తీసుకోవడంపై పూర్తి నిర్ణయం ఛానల్ వారిదే. ఒకవేళ ఏదేనై ఉంటే... అతి త్వరలోనే అధికారికంగా ఛానల్ వారు ప్రకటిస్తారు అంటూ చాలా తెలివిగా స‌మాధానం చెప్పాడు నేచుర‌ల్ స్టార్.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments