Webdunia - Bharat's app for daily news and videos

Install App

''శ్రీమంతుడు'' రికార్డును బ్రేక్ చేసిన భలే భలే మగాడివోయ్!

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2015 (12:28 IST)
నాని భలె భలె మగాడివోయ్ సినిమా శ్రీమంతుడు రికార్డును బద్ధలు కొట్టింది. నాని కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ సెప్టెంబర్ నాలుగో తేదీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అల్లు అర‌వింద్ సమ‌ర్ప‌ణ‌లో, యువి క్రియేషన్, జిఏ2 సంయుక్తంగా ప్రొడక్ష‌న్ నెం.1 గా రూపొందిన ప‌క్కా ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైనర్‌ "భ‌లే భ‌లే మ‌గాడివోయ్' విడుదలై మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. 
 
అంతేగాకుండా.. శ్రీమంతుడి రికార్డు కూడ బ్రేక్ చేసింది. సెప్టెంబ‌ర్ 4న విడుద‌ల‌యి సూప‌ర్‌డూప‌ర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం యూఎస్ఏ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. విడుదలైన తొలి వారంలోపే నాని సినిమా భలే భలే మగాడివోయ్ 1 మిలియన్ డాలర్ వసూళ్లను అందుకుంది.
 
సినిమా విడుదలైన రోజు నుంచే ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి రోజు 3.15 కోట్లు షేర్ సంపాదించింది. నాని కెరీర్‌లో ఈగ తర్వాత ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమా ఇదే కావడం గమనార్హం. నాని, లావ‌ణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా, ముర‌ళి శ‌ర్మ‌, న‌రేష్‌, సితార‌, స్వ‌ప్న మాధురి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్, ష‌క‌ల‌క శంక‌ర్‌, బ‌ద్ర‌మ్ తదితరులు ఈ సినిమాలో నటించారు.

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

Show comments