ఆంధ్ర లో ఐదేళ్లు నరకానికి ముగింపు పడింది : నందమూరి రామకృష్ణ

డీవీ
మంగళవారం, 4 జూన్ 2024 (13:35 IST)
Nandamuri Ramakrishna, Sivaprasad, Kiran, Sai Jyoti, Perepi Eshwar, Pathan Hayat Khan, Kalesha Vali
దుర్గమ్మను దర్శించుకున్న నందమూరి రామకృష్ణ రాష్ట్రానికి ఇకపై అంతా మంచే జరగాలని కోరుకున్నారు. రాష్ట్రానికి, ప్రజలకు ఇకపై అంతా మంచి జరిగేలా ఆశీర్వదించాలని నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ ఆకాంక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఎన్నికల ఫలితాలు కూటమికి సానుకూలంగా రాబోతున్నాయని, ఇకపై ప్రజలకు అంతా మంచి జరగనుందన్నారు. ఐదేళ్లుగా అనుభవిస్తున్న నరకానికి ఈ రోజుతో ముగింపు కలగబోతోందన్నారు. 
 
Nandamuri Ramakrishna
అమ్మవారి చల్లని దీవెనలు రాష్ట్రంపై, ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలకు అవస్థలు, తిప్పలు, పన్నుల మోతలు తప్ప మరేమీ లేవు. యువతకు ఉద్యోగాల్లేవు. రైతులకు గిట్టుబాటు ధరల్లేవు. అభివృద్ధి అనేదే రాష్ట్రంలో లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని మెరుగైన మార్గంలో నగిపించేలా ఎన్డీఏ కూటమికి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. కార్యక్రమంలో వీరమాచనేని శివప్రసాద్, వల్లూరు కిరణ్, సాయి జ్యోతి, పేరేపి ఈశ్వర్, పఠాన్ హయ్యత్ ఖాన్, కాలేషా వలి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండిగో సంక్షోభంపై నోరెత్తిన కేటీఆర్.. సంపద కొన్ని సంస్థల చేతుల్లోనే కూరుకుపోయింది..

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments