Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు సినిమాల‌తో బిజీగా వున్న నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్

Webdunia
సోమవారం, 5 జులై 2021 (15:47 IST)
Kalyan ram
నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ ప్ర‌స్తుతం త‌న బేన‌ర్ ఎన్‌.టి.ఆర్‌. ఆర్ట్స్ ప‌తాకంపై `బింబిసారా` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చారిత్ర‌క నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో ఆయ‌న న‌టిస్తూ రూపొందిస్తున్న చిత్రం లుక్ ఇప్ప‌టికే మంచి స్పంద‌న తెచ్చుకుంది. ఈ చిత్రంతోపాటు మ‌రో రెండు సినిమాలు ఆయ‌న చేయ‌నున్నారు. సోమ‌వారం (జూలై5), క‌ళ్యాణ్‌రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమాల‌ను చిత్ర యూనిట్ ప్ర‌క‌టించారు.
 
మ‌హేశ్ కోనేరు నిర్మాత‌గా
నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ హీరోగా న‌టించ‌నున్న 22వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.  ఇదే బ్యాన‌ర్‌లో ఇంత‌కు ముందు క‌ళ్యాణ్‌రామ్ చేసిన చిత్రం `118`సూప‌ర్ హిట్ట‌యిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌లో క‌ళ్యాణ్‌రామ్ చేయ‌బోయే  సినిమా వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. చిత్ర ద‌ర్శ‌కుడు, హీరోయిన్‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివరాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని యూనిట్ స‌భ్యులు తెలియ‌జేశారు.
 
దిల్ రాజు నిర్మాత‌గా చిత్రం
కళ్యాణ్‌ రామ్‌తో టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్‌రాజు, శిరీశ్‌ నిర్మాతలుగా ఓ కొత్త చిత్రం రూపొందనుంది. సోమవారం (జూలై 5) కళ్యాణ్‌ రామ్‌ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. డిఫరెంట్‌ చిత్రాలకు కేరాఫ్‌ నందమూరి కళ్యాణ్‌రామ్‌. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌(దిల్‌రాజు, శిరీశ్‌).వీరి కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రానికి కె.వి.గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కళ్యాణ్‌రామ్‌, గుహన్‌ కాంబినేషన్‌లో రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ '118' సూపర్‌ డూపర్‌ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ కానుంది. మరో డిఫరెంట్‌ రోల్‌లో కళ్యాణ్‌రామ్‌ను చూపించడానికి గుహన్‌ సరికొత్త కథాంశంతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. కళ్యాణ్‌రామ్‌ నటిస్తోన్న 20వ చిత్రమిది. త్వరలోనే ప్రారంభం కాబోయే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు గురించి త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments