Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి కళ్యాణ్‌రామ్‌, పూరి జగన్నాథ్‌ల 'ఇజం'కు యు/ఏ.. 21న రిలీజ్

నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై, నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇజం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈనెల 21వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే, ఈ చిత్రానికి గ

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (16:33 IST)
నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై, నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇజం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈనెల 21వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే, ఈ చిత్రానికి గురువారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇందులో ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ లభించింది. 
 
ఈ చిత్రం కేవలం 2.10 నిమిషాల రన్ టైంతో ఎక్కడా లాగ్‌లేని ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో ఉంటుంది అని చిత్ర బృందం చెబుతోంది. ఒక కొత్త కాన్సెప్ట్‌తో, ఇప్పటివరకు తెలుగు తెర మీద చూడని ఒక సరికొత్త పాయింట్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
 
సిక్స్ ప్యాక్ బాడీతో, టోటల్ న్యూ లుక్‌లో కనపడుతున్న కళ్యాణ్ రామ్‌కి సోషల్ మీడియా‌లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2015 టైటిల్ గెలుచుకున్న అదితి ఆర్య ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ చిత్రంపై కళ్యాణ్ రామ్ స్పందిస్తూ "ఇజం నా కెరీర్‌లో ఒక స్పెషల్ చిత్రంగా నిలుస్తుంది అని నమ్ముతున్నాను. పూర్తి ఎంటర్టైన్మెంట్‌తో పాటు ఒక మంచి సోషల్ ఎలిమెంట్‌ని ఈ చిత్రంలో డైరెక్టర్ పూరి ప్రజెంట్ చేశారు. అక్టోబర్ 21న విడుదల చేస్తున్నాం" అని చెప్పారు. 
 
నందమూరి కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments