Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (17:21 IST)
devil date poster
నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ క‌థానాయ‌కుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. ఇప్పటి వరకు విడుద‌లైన ఈ సినిమా గ్లింప్స్‌లో హీరో పాత్ర తీరు తెన్నులు, డెవిల్ పాత్రలో తను ఒదిగిపోయిన విధానం, లుక్‌కి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే హీరోయిన్ సంయుక్తా మీనన్ లుక్ కి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ చేయనటువంటి జోనర్ మూవీ.. భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. దీంతో  సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ప్రేక్ష‌కులు, అభిమానులు ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌టం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయ‌బోతున్నారు.
 
‘డెవిల్’ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఆయ‌న ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఆక‌ట్టుకోబోతున్నారు. గ‌త ఏడాది తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో వ‌న్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన ‘బింబిసార’తో మెప్పించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది ‘డెవిల్’తో మెప్పించటానికి రెడీ అవుతున్నారు.
 
 అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై  అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ఎన్నో మంచి చిత్రాను మనకు అందించిన అభిషేక్ పిక్చర్స్ సంస్థలో రూపొందుతోన్న ఈ సినిమాకు   శ్రీకాంత్ విస్సా  మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. గాంధీ నడికుడికర్ ఈ సినిమాకు ప్రొడఓన్ డిజైనర్‌గా బాధ్యతలను నిర్వహించారు. త‌మ్మిరాజు ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments