Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరబ్రహ్మశాస్త్రి మరణం తెలుగు వారికి తీరని లోటు : నందమూరి బాలకృష్ణ

మరుగునపడిపోయిన తెలుగు చరిత్ర వెలుగులోకి తెచ్చిన మహనీయులు పరబ్రహ్మశాస్త్రి పోషించిన పాత్ర బహు కీలకమైనది. కాకతీయుల చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయడం మొదలుకొని శాతవాహనులు తెలుగువారే అని నిరూపించిన ఘటికుల

Webdunia
గురువారం, 28 జులై 2016 (17:01 IST)
మరుగునపడిపోయిన తెలుగు చరిత్ర వెలుగులోకి తెచ్చిన మహనీయులు పరబ్రహ్మశాస్త్రి పోషించిన పాత్ర బహు కీలకమైనది. కాకతీయుల చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయడం మొదలుకొని శాతవాహనులు తెలుగువారే అని నిరూపించిన ఘటికులు పరబ్రహ్మశాస్త్రి. విద్యార్థులకు చరిత్ర పరిశోధనలో సరికొత్త బాట చూపిన ఆయన బుధవారం (జూలై 27)న తుదిశ్వాస విడిచారు.
 
ఈ సందర్భంగా శాతవాహనుల చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ చరిత్రకారుడు పరబ్రహ్మశాస్త్రి మరణనానికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన 100వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రం కోసం శాతవాహనుల్లో ఐదో రాజైన శాతకర్ణి గురించి తమకు తెలియని చాలా విషయాలను పరబ్రహ్మశాస్త్రి గారు నిర్వహించిన పరిశోధన, ఆయన రాసిన సంపుటాల నుంచే తెలుసుకొన్నట్టు తెలిపారు. 
 
అటువంటి మహోన్నత వ్యక్తి నేడు మన మధ్య లేరు అనే విషయం నన్ను చాలా బాధిస్తోంది. తెలుగు భాషను ప్రేమించే వ్యక్తిగా తెలుగు చరిత్రను దశదిసలా వ్యాపింపజేసిన పరబ్రహ్మశాస్త్రి కుటుంబానికి అండగా నిలుస్తానని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా "గౌతమిపుత్ర శాతకర్ణి" దర్శకులు క్రిష్ మరియు యూనిట్ సభ్యులందరూ పరబ్రహ్మశాస్త్రి మరణానికి చింతిస్తూ నివాళులర్పించారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments