Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవకీ నందన వాసుదేవ నుంచి నమో ఈశ్వర సాంగ్ రిలీజ్

డీవీ
మంగళవారం, 29 అక్టోబరు 2024 (14:51 IST)
Namo Iswara song still
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ 'దేవకి నందన వాసుదేవ' లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. గుణ 369తో ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.  
 
ఇప్పటికే మొదటి రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ రోజు మేకర్స్ నమో ఈశ్వర సాంగ్ ని రిలీజ్ చేశారు. సెన్సేషనల్ కంపోజర్  భీమ్స్ సిసిరోలియో ఈ సాంగ్ ని  పవర్ ఫుల్ స్పిరిట్యుయల్ ట్రాక్ గా కంపోజ్ చేశారు. శ్రీనివాస మౌళి పత్రి లిరిక్స్ గొప్ప ఆధ్యాత్మిక భావాన్ని చాటాయి. స్వరాగ్ కీర్తన్ తన పవర్ ఫుల్ వోకల్స్ తో మెస్మరైజ్ చేశారు.
 
ఈ సాంగ్ లో అశోక్ గల్లా ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. సాంగ్ లో విజువల్స్ చాలా గ్రాండ్ గా వున్నాయి. 'నమో ఈశ్వర' కార్తీక మాసంలో పర్ఫెక్ట్ లో శివుని సాంగ్ గా ఆకట్టుకుంది.
 
డివైన్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో అశోక్ గల్లా సరసన వారణాసి మానస కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి హను మాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.
 
ఈ చిత్రానికి  సినిమాటోగ్రఫీని ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌.
 దేవకి నందన వాసుదేవ మూవీ నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
 నటీనటులు: అశోక్ గల్లా, వారణాసి మానస

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా కుటుంబం నుంచి దూరం చేసిన వారి అంతు చూస్తా : కె.కవిత

భారత్‌తో నాలుగు యుద్ధాలు చేశాం... ఏం లాభం... ప్చ్... : పాక్ ప్రధాని షెహబాజ్

కాశ్మీర్‌పై మరోమారు విషం చిమ్మిన పాక్ ప్రధాని షెహబాజ్

ఏమిటీ H-1B Visa? కొత్త నిబంధనపై ట్రంప్ గూబ గుయ్, ఇండియన్ టెక్కీలు దెబ్బకి ట్రంప్ యూటర్న్

ఆప్ఘనిస్థాన్‌కు గట్టివార్నింగ్ ఇచ్చిన డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

తర్వాతి కథనం
Show comments