Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ కుమార్తెకు మంచి పేరు చెప్తారా? కండీషన్.. 'ఏ' అక్షరంతో పేరుండాలి

టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ - స్నేహారెడ్డి దంపతులకు ఇటీవల పండంటి కుమార్తె పుట్టిన విషయం తెల్సిందే. ఈ బిడ్డకు మంచి పేరు కోసం వెతుకుతున్నారు. సాధారణంగా బిడ్డకు పేరు పెట్టాలంటే ఆస్ట్రాలజీ ప్రకారం పెడుతు

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (13:16 IST)
టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ - స్నేహారెడ్డి దంపతులకు ఇటీవల పండంటి కుమార్తె పుట్టిన విషయం తెల్సిందే. ఈ బిడ్డకు మంచి పేరు కోసం వెతుకుతున్నారు. సాధారణంగా బిడ్డకు పేరు పెట్టాలంటే ఆస్ట్రాలజీ ప్రకారం పెడుతుంటారు. కానీ, అల్లు అర్జున్ మాత్రం 'ఏ' అక్షరంతో వచ్చేలా పేరు పెట్టాలని భావిస్తున్నారు. ఈ అంశం ఇపుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది ఏంటంటే... అల్లు అర్జున్‌ పేరులో ఇంటి పేరు 'ఎ' అనుకుంటే.. మనిషి పేరు కూడా 'ఎ'తో మొదలైంది. ఇక అల్లు వారింట్లో పుడుతున్న పిల్లలందరికీ 'ఎ' అనే అక్షరంతోనే పేర్లు పెట్టాలని డిసైడైనట్లున్నారు. ఆల్రెడీ బన్నీ అన్నయ్య కూతురు పేరు అన్విత అని పెట్టారు. బన్నీ కొడుకు పేరును అయాన్‌ అని నామధేయం చేశారు. అంటే అందరూ ఎ-ఎ అంటూ బన్నీ పెట్టే సైన్‌‌ను చక్కగా వాడేసుకుంటారు అన్నమాట.
 
ఇప్పుడిక బన్నీ-స్నేహల రెండో సంతానం అయిన క్యూట్‌ గాళ్‌ పేరును కూడా 'ఎ' అనే అక్షరంతోనే పెడతారని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు 'ఎ' అనే అక్షరంతో కొత్తగా అనిపించే ఆడపిల్లల పేర్లను ఆల్రెడీ అల్లూ ఫ్యామిలీ స్టడీ చేస్తోందట. మొత్తానికి 'ఎ-ఎ' ఫ్యామిలీగా అల్లూ వారి తర్వాత తరమంతా వర్ధిల్లుతుంది అనమాట. ఇక బన్నీ కూతురి పేరేంటో తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అర కేజీ బరువుతో జన్మించిన పసికందుకు ప్రాణం పోసిన హైదరాబాద్ వైద్యులు

కేక్ కట్ చేయాల్సిన 9 యేళ్ల బాలుడు తలకొరివి పెట్టడం కలచివేసింది...

ఏపీ లిక్కర్ స్కామ్‌: నారాయణ స్వామికి నోటీసులు.. అరెస్ట్ అవుతారా?

భార్యాభర్తలు పడక గదిలో ఏకాంతంగా ఉన్నపుడు వీడియో తీసి వివాహితకు పంపారు..

వరుసగా కూర్చుని విందు భోజనం ఆరగిస్తున్న వానరాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments