Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శివ' కంటే మెరుగైన హిట్ ఇస్తానని రామ్ ప్రామీస్ చేశాడు : నాగార్జున

అక్కినేని నాగార్జు, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో కంపెనీ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో 1990లో "శివ" చిత్రం వచ్చింది. ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, తెలుగు చిత

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (12:48 IST)
అక్కినేని నాగార్జు, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో కంపెనీ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో 1990లో "శివ" చిత్రం వచ్చింది. ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారంచుట్టింది. ఇపుడు మళ్లీ ఈ అరుదైన కాంబినేషన్‌లో ఓ చిత్రం రానుంది. ఈ చిత్రం పేరు "కంపెనీ". ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
 
ఈ చిత్రం ముహూర్తపు వేదికపై నాగ్ మాట్లాడుతూ, "రామూ నేను అప్పుడు శివ తీశాము. శివ మేడ్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నేషనల్లీ... ఒక టెక్నికల్ స్టాండర్డ్. ఈ సినిమా కూడా చేసిపెడతావా నాకు? అని అడిగితే... దానికన్నా ఎక్కవ చేస్తానని చెప్పాడు. ప్రామిస్ చేశాడు. సో అయామ్ లుకింగ్ ఫార్వార్డ్. ఐ వాంటూ లెర్న్ న్యూ టెక్నిక్" అని చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, రామ్ తన మాట నెరవేర్చుకుంటానని నమ్ముతున్నట్టు తెలిపాడు. ఇప్పటికే కొన్ని షాట్స్ గురించి వర్మ చెప్పాడని, అవి అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటుల ఎంపిక జరగాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments