Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్ హాసన్‌తో నగ్మా భేటీ.. రజనీ రాజకీయ అరంగేట్రంపై చర్చ?

ప్రముఖ నటుడు కమల్ హాసన్‌తో కాంగ్రెస్ పార్టీ నేత, సినీ నటి నగ్మా భేటీ అయ్యింది. తమిళ రాజకీయాలపై ఇటీవల విమర్శల వర్షం కురిపిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న కమల్ హాసన్‌ను చెన్నై, ఆళ్వార్‌పేటలోని ఆయన నివ

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (09:02 IST)
ప్రముఖ నటుడు కమల్ హాసన్‌తో కాంగ్రెస్ పార్టీ నేత, సినీ నటి నగ్మా భేటీ అయ్యింది. తమిళ రాజకీయాలపై ఇటీవల విమర్శల వర్షం కురిపిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న కమల్ హాసన్‌ను చెన్నై, ఆళ్వార్‌పేటలోని ఆయన నివాసంలో నగ్మా గంటపాటు భేటీ అయ్యారు. రాజకీయాల గురించి వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపైన కూడా వీరు చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి భేటీ తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.
 
కాగా, కమల్ హాసన్ కొద్ది రోజులుగా త‌మిళనాడు ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసి ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌లు విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవల ఓ రిసెప్షన్‌కు హాజరైన కమల్ హాసన్.. ఈ వేడుక కేవ‌లం వివాహానికి సంబంధించిన‌ది కాదు, నా రాజ‌కీయ ప్ర‌యాణానికి మొద‌లు అనుకోండన్నారు.
 
ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు చుర‌క కూడా అంటించారు. ప్రతీ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకోండి. డబ్బులు తీసుకుని దొంగలకు ఓట్లేసి మీరే ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చేశారన్నారు. రాజకీయాల్లో మార్పు రావాలి.. దీనిపై పోరాటం ఎప్పటికీ కొనసాగుతూనే వుంటుందని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫోనులో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు.. కేసు నమోదు

ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు.. ఆ జిల్లాల్లో 50 బస్సులు

ప్రియురాలిని సూట్‌‍కేసులో దాచిపెట్టీ.... ప్రియుడి సాహసం (Video)

అయోధ్య గెస్ట్ హౌస్‌లో మహిళ స్నానం చేస్తుంటే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

నల్గొండలో అర్థరాత్రి హత్య కలకలం.. వేట కత్తులతో కలర్ ల్యాబ్‌ ఓనర్ హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments