Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కొడుకు పెళ్లికొడుకయ్యాడు.. : నాగ్ ట్వీట్

అక్కినేని వారసుడు నాగ చైతన్య - సమంతల పెళ్లి మరికొన్ని గంటల్లో జరుగనంది. శుక్రవారం హిందూ సంప్రదాయం ప్రకారం, శనివారం క్రిస్టియన్ పద్దతిలో వీరిద్దరి వివాహం జరుగనుంది. గోవాలోని డబ్ల్యూ హోటల్‌లో అక్కినేని,

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (13:52 IST)
అక్కినేని వారసుడు నాగ చైతన్య - సమంతల పెళ్లి మరికొన్ని గంటల్లో జరుగనంది. శుక్రవారం హిందూ సంప్రదాయం ప్రకారం, శనివారం క్రిస్టియన్ పద్దతిలో వీరిద్దరి వివాహం జరుగనుంది. గోవాలోని డబ్ల్యూ హోటల్‌లో అక్కినేని, దగ్గుబాటి, సమంతల కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకలు జరుగనున్నాయి.
 
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం మెహందీ ఫంక్షన్‌తో చైతూ- సామ్‌‍ల పెళ్లి వేడుకలతో ప్రారంభమవుతాయి. ఇందులోభాగంగా, చైతూని పెళ్లి కొడుకుని చేశారు. ఈ విషయాన్ని నాగ్ ఫోటోని పోస్ట్ చేస్తూ తెలిపాడు. అలాగే, ‘అల్లుడి పెళ్లికొడుకు ఫంక్షన్లో దిగిన ఫొటో. చూస్తుండగానే ఎంత పెద్దవాడైపోయాడో. కంగ్రాట్స్ చై’ అని వెంకటేశ్ పేర్కొన్నారు. 
 
ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా, అక్టోబర్ 6 మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మెహందీ వేడుకకు ప్లాన్ చేయగా, ఆ తర్వాత 8 గంటల 30 నిమిషాలకు విందు, రాత్రి 11 గంటల 52 నిమిషాలకు హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరుగనుంది. 
 
ఇక శనివారం(అక్టోబర్ 7) రోజున క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వివాహం జరగనుండగా, ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు విందు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి విందుతో పాటు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులకు గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments