Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున ది ఘోస్ట్‌ కర్నూలులో ప్రీరిలీజ్

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (07:21 IST)
Nagarjuna, The Ghost,
అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్' ది ఘోస్ట్' ప్రమోషన్స్ ఇప్పటికే జోరందుకున్నాయి. నాగార్జున- సోనాల్ చౌహాన్ ల అద్భుతమైన కెమిస్ట్రీతో యువతను ఆకట్టుకున్న ఫస్ట్ సింగిల్ వేగంతో మ్యూజిక్ ప్రమోషన్లు కూడా చార్ట్‌బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి.
 
తర్వాతి భారీ ఈవెంట్ గురించి చిత్ర యూనిట్ సమాచారం ఇచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా జరగనుంది. కర్నూలులోని ఎస్టీబీసీ మైదానం ఈ వేడుకకు వేదికైంది. గ్రాండ్ గా జరిగే ఈ వేడుకకు టీమ్ అంతా హాజరుకానున్నారు.
 
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.
 
భరత్‌, సౌరబ్‌ ద్వయం ఈ సినిమా పాటలని స్కోర్ చేస్తున్నారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
 
ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.
తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు
సాంకేతిక విభాగం : దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు, నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.
సంగీతం: మార్క్ కె రాబిన్, ((పాటలు భరత్ - సౌరబ్)
యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల
పీఆర్వో : వంశీ-శేఖర్, బీఏ రాజు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments