Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ సినిమాల ఫస్ట్‌ లుక్‌, ఆగస్టు 29న రిలీజ్

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2015 (18:50 IST)
ఆగస్ట్‌ 29 టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున బర్త్‌డే. ఈ సందర్భంగా కింగ్‌ నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ చిత్రాలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌లను అదేరోజు ఒకే వేదికపై రిలీజ్‌ చెయ్యబోతున్నారు. నాగార్జున ద్విపాత్రాభినయంతో కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న 'సోగ్గాడే చిన్ని నాయనా', యువసామ్రాట్‌ నాగచైతన్య, గౌతమ్‌ మీనన్‌ కాంబినేషన్‌లో రాబోతున్న 'సాహసమే శ్వాసగా సాగిపో',  నవసామ్రాట్‌ అఖిల్‌ అక్కినేని, వి.వి.వినాయక్‌ కాంబినేషన్‌లో వస్తున్న 'అఖిల్‌' చిత్రాల ఫస్ట్‌లుక్‌లను నాగార్జున బర్త్‌డే రోజున రిలీజ్‌ చేస్తున్నారు. 
 
తండ్రీ.. ఇద్దరు కొడుకులు హీరోలుగా ఒకే టైమ్‌లో ఇండస్ట్రీలో వుండటం టాలీవుడ్‌లోనే కాదు ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఇది రికార్డ్‌. ఈ క్రెడిట్‌ అక్కినేని వంశానికే దక్కినందుకు అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల కోరిక మేరకే నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ చిత్రాల ఫస్ట్‌ లుక్‌లను నాగార్జున బర్త్‌డే రోజునే రిలీజ్‌ చేయడానికి ప్లానింగ్‌ జరిగింది. 
 
తండ్రి, కొడుకులు ఒకే టైమ్‌లో నటించడమే ఓ రికార్డ్‌ అయితే.. ఈ ముగ్గురి సినిమాల ఫస్ట్‌ లుక్స్‌ ఒకేరోజు రిలీజ్‌ చెయ్యడం మరో రికార్డ్‌. ఈ స్పెషల్‌ డే కోసం అక్కినేని వంశాభిమానులు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. కొడుకులిద్దరితో పోటీపడుతూ కింగ్‌ నాగార్జున సూపర్‌ సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌లో ముందుకు వెళ్ళడం విశేషం.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments