Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో నాగార్జున‌, ప్ర‌వీణ్ స‌త్తారు చిత్రం

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (18:28 IST)
Nagrajuna
నాగార్జున‌, ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ సత్తారు కాంబినేష‌న్‌లో హై రేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వ‌ర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై నారాయ‌ణ్ దాస్ కె.నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు, శ‌ర‌త్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లో ప్రారంభించారు. ఏక‌ధాటిగాసాగే షెడ్యూల్‌లో నాగార్జున‌, గుల్ ప‌నాంగ్‌, అనిఖా సురేంద్ర‌న్ త‌దిత‌రుల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.
 
మేక‌ర్స్ లొకేష‌న్‌లో నాగార్జునగారి వ‌ర్కింగ్ స్టిల్స్‌ను విడుద‌ల చేశారు. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లో నాగార్జున ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ రోల్‌లో మెప్పించ‌బోతున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయ‌ని ఈచిత్రానికి ముకేశ్.జి సినిమాటోగ్రాఫ‌ర్‌. బ్ర‌హ్మ క‌డ‌లి ఆర్ట్‌, రాబిన్ సుబ్బు, న‌భా మాస్ట‌ర్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్స్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.
 
సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌వీణ్ స‌త్తారు, నిర్మాత‌లు: నారాయ‌ణ దాస్ నారంగ్‌, పుస్కూర్ రామ్మోన్‌రావు,శ‌ర‌త్ మ‌రార్‌, బ్యాన‌ర్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, సినిమాటోగ్ర‌ఫీ: ముఖేశ్.జి, యాక్ష‌న్‌:రాబిన్ సుబ్బు, న‌భా మాస్ట‌ర్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌: బ్ర‌హ్మ క‌డ‌లి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్‌ను గద్దె దించాను.. చిరకాల ధ్యేయం నెరవేరింది.. రేవంత్ రెడ్డి

బంగారు విగ్రహాలతో అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ వెడ్డింగ్ కార్డ్- వైరల్

ఆ వార్త విన్నాకే రామోజీ రావు పరమపదించారు.. పవన్ కల్యాణ్ (video)

అమరావతి నిర్మాణానికి రూ.10కోట్లు విరాళం: ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌ (video)

ఓమ్నీ కారు నడిపిన గులాబీ పార్టీ హీరో.. నెట్టింట ఫోటో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

తర్వాతి కథనం
Show comments