Webdunia - Bharat's app for daily news and videos

Install App

జానీ మూవీ రీమేక్ చేస్తున్న నాగ్..!

నాగార్జున... జానీ మూవీ రీమేక్ చేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..? విష‌యం ఏంటంటే... నాగార్జున.. నాని మల్టీస్టారర్‌గా ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మాములుగా దర్శకులు ఇంగ్లీషు సినిమాలను చూసి ఇన్స్పైర్ అ

Webdunia
మంగళవారం, 22 మే 2018 (20:42 IST)
నాగార్జున... జానీ మూవీ రీమేక్ చేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..? విష‌యం ఏంటంటే... నాగార్జున.. నాని మల్టీస్టారర్‌గా ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మాములుగా దర్శకులు ఇంగ్లీషు సినిమాలను చూసి ఇన్స్పైర్ అయ్యి కథలు రాసుకుంటూ ఉంటారు. అయితే... శ్రీరామ్ ఆదిత్య మాత్రం బాలీవుడ్‌లో వచ్చిన జానీ గద్దర్ సినిమాను ఇన్స్పిరేషన్‌గా తీసుకొని సినిమా చేస్తున్నాడు అని తెలిసింది.
 
జానీ గద్దర్ ఇన్స్పిరేషన్‌తోనే కథను తయారుచేసుకున్నట్టుగా శ్రీరామ్ నాగార్జునకు, నానికి ముందుగానే తెలియజేశాడట. విషయం దాచిపెట్టి తరువాత ఎప్పుడో చెప్పడంకంటే.. ముందుగానే చెప్పడం మంచిది అనే ఉద్దేశ్యంతో శ్రీరామ్ ఆదిత్య ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తయింది. 
 
ప్ర‌స్తుతం హైద‌రాబాద్ సార‌థి స్టూడియోలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాలో రష్మిక, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చరిత్రలోనే తొలిసారి ఆప్ఘన్ మంత్రితో జైశంకర్ చర్చలు

హైదరాబాద్‌లో దారుణం : బ్యాట్‌తో కొట్టి.. కత్తులతో గొంతుకోసి హత్య

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!

హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments