Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదీ 'కింగ్' నాగార్జున న్యూ ఇయర్ ప్లాన్.. హ్యాట్రిక్ కొట్టేలా ప్రణాళికలు

టాలీవుడ్ 'మన్మథుడు'గా గుర్తింపు పొందిన హీరో అక్కినేని నాగార్జున. ఈయన గత యేడాది రెండు మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. గత సంక్రాంతికి విడుదలైన 'సోగ్గాడే చిన్ని నాయనా', ఆ తర్వాత విడుదలైన 'ఊపిరి' వంటి ర

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (12:55 IST)
టాలీవుడ్ 'మన్మథుడు'గా గుర్తింపు పొందిన హీరో అక్కినేని నాగార్జున. ఈయన గత యేడాది రెండు మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. గత సంక్రాంతికి విడుదలైన 'సోగ్గాడే చిన్ని నాయనా', ఆ తర్వాత విడుదలైన 'ఊపిరి' వంటి రెండు డిఫరెంట్ జానర్ మూవీస్ రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాడు. 
 
2017 సంవత్సరంలోనూ ఇదే జోష్‌ను కొనసాగించాలన్న పట్టుదలతో నాగార్జున ఉన్నాడు. ఇందులోభాగంగా, నాగార్జున నటించిన భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ సినిమాకు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. 'అన్నమయ్య ', 'శ్రీరామదాసు' వంటి హిట్స్ తర్వాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున చేస్తున్న భక్తి చిత్రం కావడం ఈ మూవీకి ప్లస్ అయ్యింది.
 
ఈ చిత్రం తర్వాత 'రాజుగారి గది' సీక్వెల్‌లో నటించనున్నాడు. ఈ మూవీతో నాగార్జున ఫస్ట్ టైం హారర్ కామెడీ ట్రై చేస్తున్నాడు. పివిపి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని ఓంకార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత మరో యంగ్ డైరెక్టర్ చందూ మొండేటితో మూవీ చేయబోతున్నాడు. 'కార్తికేయ', 'ప్రేమమ్' లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్‌తో హిట్ ఇచ్చిన చందూ.. నాగార్జున కోసం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రెడీ చేశాడు. ఈ చిత్రం షూటింగ్‌ను వేసవిలో ప్రారంభించి యేడాది ఆఖరుకు విడుదల చేయాలన్న ప్లాన్‌లో ఉన్నాడు. మొత్తం ఈ యేడాది మూడు చిత్రాలతో ప్రేక్షకులను ఆలరించాలన్న పట్టుదలతో నాగార్జున ఉన్నారు. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments