Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో సుమంత్ లుక్... నాగ్ ఏమన్నారో తెలుసా..?

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా ఎన్టీఆర్ అనే ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. బాల‌కృష్ణ ఎన్టీఆర్ పాత్ర పోషిస్తుంటే... సుమంత్ అక్కినేని పాత్ర పోషిస్తున్నాడు. క్రిష్ ఏమాత్రం రాజీప‌డ‌కుండా.. చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుని ఎంతో

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (10:53 IST)
నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా ఎన్టీఆర్ అనే ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. బాల‌కృష్ణ ఎన్టీఆర్ పాత్ర పోషిస్తుంటే... సుమంత్ అక్కినేని పాత్ర పోషిస్తున్నాడు. క్రిష్ ఏమాత్రం రాజీప‌డ‌కుండా.. చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుని ఎంతో ఇష్టంతో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలోని ఒక్కో పాత్ర గెట‌ప్ రిలీజ్ చేస్తుంటే... సినిమాపై రోజురోజుకు అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఇటీవ‌ల రిలీజ్ చేసిన సుమంత్ గెట‌ప్ ఎంత బాగుందో తెలిసిందే.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో నాన్నగారి పాత్ర‌కు(అక్కినేని) మిమ్మ‌ల్ని సంప్ర‌దించారా అని నాగార్జున‌ని అడిగితే.. ఇందులో నన్నెవ్వరూ సంప్రదించలేదు. నాన్నకీ నాకూ పెద్దగా పోలికలు ఉండవు. నాన్న ఎత్తు ఐదడుగులా ఐదు అంగుళాలు. నేనేమో ఆరడుగులు ఉంటాను అని చెప్పారు. సుమంత్‌కీ, నాన్నకీ మంచి పోలికలు ఉంటాయి. ఎత్తు మినహాయిస్తే వాళ్లిద్దరూ ఒకలాగే కనిపిస్తుంటారు. ఎన్టీఆర్‌లో నాన్నగారి పాత్రలో సుమంత్‌ లుక్‌ చూశా. చాలా బాగుందన్నారు. అలాగే చంద్రబాబునాయుడు పాత్రలో రానా లుక్‌ ఆకట్టుకుంది అంటూ ఎన్టీఆర్ బ‌యోపిక్ గురించి త‌న మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టారు నాగార్జున‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments