Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఊపిరి''కి తర్వాత నిఖిల్‌తో మల్టీస్టారర్‌కు అక్కినేని నాగార్జున రెడీ

2016లో కార్తీతో కలిసి నటించిన ఊపిరి సినిమా బంపర్ హిట్ కావడంతో టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అక్కినేని నాగార్జున, యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీ స్టారర్‌ మూవీ చేయబోతున్నట్లు తెలిసింది. ఈ ఏడాది

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (16:27 IST)
2016లో కార్తీతో కలిసి నటించిన ఊపిరి సినిమా బంపర్ హిట్ కావడంతో టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అక్కినేని నాగార్జున, యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీ స్టారర్‌ మూవీ చేయబోతున్నట్లు తెలిసింది. ఈ ఏడాది ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని నాగార్జున ఉవ్విళ్లూరుతున్నారు.

నిఖిల్‌ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' తర్వాత నటిస్తున్న 'కేశవ' చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున, నిఖిల్ సినిమాను 'ప్రేమమ్‌'తో ఇటీవల మంచి సక్సెస్‌ అందుకున్న దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించనున్నారట. 
 
ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగార్జున ప్రస్తుతం తన తర్వాతి చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' పనుల్లో బిజీగా ఉన్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments