Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియాకి షాక్ ఇచ్చిన దేవ‌దాస్..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌నన్‌లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ 'దేవ‌దాస్'. ఈ చిత్రానికి శ్రీరామ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (18:31 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌నన్‌లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ 'దేవ‌దాస్'. ఈ చిత్రానికి శ్రీరామ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. ఇందులో నాగ్ డాన్ దేవ్‌గా న‌టిస్తుంటే... నాని డాక్ట‌ర్ దాస్‌గా న‌టిస్తున్నారు. ఈ రోజుతో బ్యాంకాక్ షెడ్యూల్ పూర్త‌య్యింది. ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. బ్యాంకాక్ నుంచి టీమ్ హైద‌రాబాద్ వ‌చ్చిన త‌ర్వాత ఆ సాంగ్‌ను చిత్రీక‌రించనున్నారు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ నెల 29న నాగార్జున పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా 29న టీజ‌ర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అంటూ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు మీడియాకి షాక్ ఇస్తూ.. దేవ‌దాస్ టీజ‌ర్‌ని ఈనెల 29వ తేదీన కాదు 24వ తేదీన రిలీజ్ చేస్తున్నాం అని తెలియ‌చేశారు. అవును ఈనెల 24న సాయంత్రం 5 గంట‌ల‌కు టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు. 
 
ఈ విష‌యాన్ని నాగార్జున‌, నాని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ డిఫ‌రెంట్ గా ఉన్న పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ట్రైల‌ర్ రిలీజ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్ధాయిలో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 27వ తేదీన రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రి... దేవ‌దాస్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments