Naga Chaitanya Shobita Wedding: శోభిత నాగచైతన్యల పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో నాగచైతన్య శోభిత జంటతోపాటు నాగార్జున, అమల, వెంటేశ్, దగ్గుపాటి సురేష్ బాబుతోపాటు మిగతా కుటుంబ సభ్యులు కనిపించారు. ఈ పెళ్లిలో అఖిల్ తన అన్నయ్య పెళ్లి జరగడంతో ఆనందంగా విజిల్ కూడా వేయడం ఈ పెళ్లికి మరో హైలెట్‌గా నిలిచింది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక ఈ పెళ్లిలో శోభిత బంగారు రంగు జరీ చీర ధరించి వాటికి తగిన బంగారు నగలను ధరించగా, నాగచైతన్య ఎరుపు బార్డర్ ఉన్న పంచ కట్టి సంప్రదాయబద్ధంగా కనిపించారు.
ఇక నాగచైతన్య శోభితల నిశ్చితార్థం ఇదే ఏడాది ఆగష్టు నెలలో జరిగిన సంగతి తెలిసిందే. అలాగే నాగచైతన్యకు ఇది రెండో వివాహం ఆయన మొదట హిరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో 2021లో వీరు వీడిపోతున్నట్లు ప్రకటించారు.