Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడుదల తేదీ ప్ర‌క‌టించిన నాగ చైతన్య థ్యాంక్యూ చిత్రం

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (16:55 IST)
Naga Chaitanya, Malvika Nair,
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న కొత్త సినిమా "థ్యాంక్యూ". శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సక్సెస్ ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. "మనం" లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను నాగ చైతన్యకు అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రాశీ ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా విడుదల చేసిన టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా, రెండు పాటలు "మారో..", "ఏంటో ఏంటేంటో..." చార్ట్ బస్టర్స్ అయ్యాయి. 
 
టీజర్ తో పాటు రిలీజ్ చేసిన రెండు పాటలు హిట్ అవడంతో "థ్యాంక్యూ" సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ముందుగా "థ్యాంక్యూ" సినిమాను జూలై 8న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ప్రస్తుతం రిలీజ్ డేట్ ను జూలై 22 తేదీకి మార్చారు. అన్ని కమర్షియల్ హంగులతో "థ్యాంక్యూ" సినిమా జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. లెజండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. బీవీఎస్ రవి కథను అందించారు. నాగ చైతన్య కెరీర్ లో "థ్యాంక్యూ" ఒక స్పెషల్ మూవీగా నిలుస్తుందని మూవీ టీమ్ నమ్మకంతో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments