Nag: నాగార్జున 100వ చిత్రం, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాగ చైతన్య టీమ్

దేవీ
శుక్రవారం, 29 ఆగస్టు 2025 (19:35 IST)
Nagachiatnya team, with Nagarjuna
అక్కినేని నాగార్జున పుట్టినరోజైన నేడు ఆగస్టు 29న జూబ్లీహిల్స్ లోని స్వగ్రుహంలో పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. నాగచైతన్య నటిస్తున్న  NC24 చిత్ర టీమ్ గర్వంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.  ఈ సందర్భంగా చిత్రం గురించి వివరాలు తెలుసుకున్నారు నాగ్. అదేవిధంగా అన్నపూర్ణ స్టూడియోస్ స్టాఫ్ మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చాలతో నాగార్జునకు శుభాకాంక్షలు తెలియజేశారు.
 
ఈ సందర్భంగా నాగార్జున కొత్త సినిమా అనగా 100వ సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుగుతుందని ప్రచారం జరిగింది. అందుకు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జీ5 చాట్ షో జయమ్ము నిశ్చయమ్ము రాలో, నాగార్జున తన ల్యాండ్‌మార్క్ 100వ చిత్రం గురించి ఓపెన్ చేశాడు. నా తదుపరి విడుదల కింగ్ 100. దీని కోసం గత 6-7 నెలలుగా సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ దర్శకుడు కార్తీక్ ఒక సంవత్సరం క్రితం నాకు స్క్రిప్ట్ చెప్పారు. ఇది ఒక గొప్ప చిత్రం,  మేము 'కూలీ' తర్వాత ప్రారంభిస్తాము. ఇది యాక్షన్ నిండిన కుటుంబ చిత్రమని నాగార్జున తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments