Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్య తండేల్ రెగ్యులర్ షూటింగ్ ఉడిపిలో ప్రారంభం

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2023 (18:07 IST)
Naga Chaitanya
నాగ చైతన్య, సక్సెస్ ఫుల్ దర్శకుడు చందూ మొండేటి, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న హై బడ్జెట్ చిత్రం 'తండేల్' కొద్ది రోజుల క్రితం గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈరోజు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉడిపిలో ప్రారంభమైంది.
 
యాక్టర్స్ అందరూ పాల్గొంటున్న ఈ కీలక షెడ్యూల్ లో చిత్ర యూనిట్ టాకీ, యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని మల్పే పోర్ట్ (ఉడిపి)లో జరుగుతోంది. నాగ చైతన్యతో పాటు ఫైటర్స్ పై యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు.
 
నాగ చైతన్య ఈ చిత్రంలో మత్స్యకారునిగా నటించడానికి బీస్ట్ మోడ్‌ లోకి మారారు. కండలు తిరిగిన దేహం కోసం గత కొన్ని నెలలుగా చాలా హార్ట్ వర్క్ చేశారు.  పొడవాటి జుట్టు, గడ్డంతో రగ్గడ్ లుక్ లో కనిపిస్తారు.
 
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. 'తండేల్' పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమకథ.
 
అత్యున్నత సాంకేతిక నిపుణులను ఈ చిత్రానికి పని చేస్తున్నారు.  కథలో సంగీతానికి మంచి స్కోప్ ఉన్నందున, జాతీయ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సౌండ్‌ట్రాక్‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రేమకథను అందంగా తీర్చిదిద్దుతున్నారు. విజువల్ వండర్ ని అందించడానికి షామ్‌దత్ కెమెరామ్యాన్ గా పని చేస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని శ్రీనాగేంద్ర తంగాల పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lunar eclipse: 2025లో సంపూర్ణ చంద్రగ్రహణం- 2018 జూలై 27 తర్వాత భారత్‌లో కనిపించే?

అమిటీ యూనివర్సిటీలో లా స్టూడెంట్‌కు 60 చెంపదెబ్బలు- వీడియో వైరల్

జగన్‌పై ఫైర్ అయిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి

Andhra Pradesh: గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు.. డ్యాన్స్ చేయొద్దన్నా వినలేదు.. చివరికి?

Noida: స్నేహితుడిపై ప్రతీకారం కోసం పోలీసులకు ఫోన్ చేశాడట..ముంబైలో భయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments