Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతు బర్త్ డే సందర్భంగా శేఖర్ కమ్ముల ఆ పని చేయబోతున్నాడు

Webdunia
శుక్రవారం, 22 నవంబరు 2019 (13:45 IST)
హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా నుండి హీరో చైతు లుక్ విడుదలైంది. ఈ పోస్టర్లో సూపర్ కూల్ లుక్‌లో నాగ చైతన్య ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. చైతు బర్త్డే సందర్భంగా నవంబర్ 23న ఉదయం 10.30 నిమిషాలకు హీరో క్యారెక్టర్ని పరిచయం చేసే ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
 
సహజత్వం నింపుకొని ఉన్న పాత్రలతో అందమైన కథలను తెర మీదకు తెచ్చే శేఖర్ కమ్ముల ఈ ప్రేమ కథను మరింత హృద్యంగా మలుచుతున్నాడు. నాగ చైతన్య లుక్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు డైరెక్టర్. తన ప్రపంచంలోకి ఆయన బర్త్ డే సందర్భంగా మనల్ని అహ్వానిస్తున్నాడు చైతు. అక్కినేని అభిమానులకు, సినిమా అభిమానులకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌గా ఉండబోతుంది ఆ వీడియో. 
 
ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్ పైన నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగచైతన్య సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: రాజీవ్ నాయర్, కెమెరా: విజయ్ సి కుమార్, 
మ్యూజిక్: పవన్, సహనిర్మాత: విజయ్ భాస్కర్, పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా, నిర్మాతలు: నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు, రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. టేకాఫ్ నిలిపివేత

Air Hostess - థానే: ఎయిర్ హోస్టెస్‌పై పైలట్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి?

మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

మేనల్లుడుతో ప్రేమ - భర్త - నలుగురు పిల్లలు వదిలేసి పారిపోయిన వివాహిత!!

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments