Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండేల్ తో కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ లోడింగ్ అవుతుందంటున్న నాగచైతన్య

డీవీ
గురువారం, 5 సెప్టెంబరు 2024 (13:53 IST)
Naga chaitanya 15 years
సినీమా రంగంలో ప్రవేశించి నేటితో 15 ఏళ్ళు అయిన సందర్భంగా నాగచైతన్య ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. తండేల్ తో కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ లోడింగ్ అవుతుందంటున్న తెలిపారు. జోష్ సినిమాతో సినీ నటుడిగా కెరీర్ ను ప్రారంభించి తొలి సినిమానే ఫ్లాప్ తెచ్చుకున్న నాగచైతన్యకు తదుపరి సినిమా ఏమాయ చేశావోతో సక్సెస్ తెచ్చుకున్నాడు. అందులో సమంత నాయికగా నటించింది.

2010లో వచ్చిన ఈ సినిమాతో వారిరువురూ ప్రేమలో వున్నట్లు 2017లో తెలిపి ఒక్కటయ్యారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసిన నాగచైతన్యకు రారండోయ్ వేడుక చూద్దాం, ఆ తర్వాత లాల్ సింగ్ ఛడ్డాలో అతిథి పాత్ర చేశారు. శైలజారెడ్డి అల్లులో నటించినా ఏవరేజ్ సినిమా నిలిచింది. ఆ తర్వాత వ్యక్తిగత కెరీర్ లో సమంతతో విడాకులు తర్వాత సరైన సినిమా సక్సెస్ రాలేదు. 
 
తాజాగా తండేల్ అనే సినిమాను గీతా ఆర్ట్స్ లో చేస్తున్నాడు. ఈ సినిమా రన్నింగ్ లో వుండగానే నటి శోభితా ధూళిపాళతో ప్రేమలో వున్నట్లు ఫైనల్ గా వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే వ్యక్తిగతంగా కొందరు జాతకాలు చెప్పేవారు ఆయనకు మనశ్శాంతి లేకుండా చేయడంతో అది మరింత వివాదమైంది. అయినా ధైర్యంగా తన నటనా వ్రుత్తిపై కాన్ సన్ ట్రేషన్ చేస్తూ తండేల్ అనే మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో సినిమా చేయడం ఆయనకు కాస్త ఊరట నిచ్చింది. ఈ సినిమా కథలోని పాత్ర కోసం 9నెలలు కష్టపడ్డానని తెలియజేశారు. చందు మొండేటి దర్శకుడు మొండిగా ఈ సినిమా సక్సెస్ అయ్యేందుకు క్రిషి చేస్తున్న విధానం తనకెంతో స్పూర్తినిచ్చిందని తెలియజేస్తూ... తండేల్ తో కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ లోడింగ్ అంటూ కాప్షన్ పెట్టి అభిమానులను సిద్ధం చేస్తున్నాడు. 
 
దీనిని నెటిజన్లు  15 ఏళ్ళ కెరీర్ లో 24 సినిమాలు చేసి అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు యువసామ్రాట్అ చైతుకు అభినందనలు తెలిపారు. తండేల్ మీ ఫిల్మోగ్రఫీలో ఒక మైలురాయి పాత్ర అవుతుంది అని కితాబిచ్చారు. సాయిపల్లవి నాయికగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్!!

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

నల్గొండలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ - 11 మంది అరెస్టు

Pawan Kalyan: తమిళనాడులో జనసేన ఏర్పాటు.. స్టాలిన్‌ను కొనియాడిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments