Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూతో రొమాంటిక్ పాటల చిత్రీకరణలో శృతిహాసన్

నాగ చైతన్య, అనుపమ పరమేశ్వరన్‌, శతి హాసన్‌, మడోన్నా సెబాస్టియన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రంలో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మళయాలంలో విజయం సాధించిన 'ప్రేమమ్‌' సినిమాను తెలుగులో అదే పేరుత

Webdunia
మంగళవారం, 19 జులై 2016 (12:35 IST)
నాగ చైతన్య, అనుపమ పరమేశ్వరన్‌, శతి హాసన్‌, మడోన్నా సెబాస్టియన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రంలో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మళయాలంలో విజయం సాధించిన 'ప్రేమమ్‌' సినిమాను తెలుగులో అదే పేరుతో నాగ చైతన్యతో రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాను 'కార్తికేయ' దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న సినిమా, వారం రోజులుగా నార్వేలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
 
ఈ నార్వే షెడ్యూల్‌లోనే పలు అందమైన లొకేషన్స్‌లో రెండు పాటలను చిత్రీకరిస్తున్నారు. శృతి హాసన్‌, చైతన్య పాల్గొంటుండగా ప్రస్తుతం ఓ రొమాంటిక్‌ సాంగ్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఇక ఇదే విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు చందూ మొండేటి, నాగ చైతన్య, సినిమాటోగ్రాఫర్‌ కార్తీక ఘట్టమనేనిలతో కలిసి దిగిన ఓ ఫోటోను శృతి హాసన్‌ పోస్ట్‌ చేశారు. తన కెరీర్‌కి బిగ్గెస్ట్‌ హిట్‌గా ఈ సినిమా నిలుస్తుందని నాగ చైతన్య మొదట్నుంచీ నమ్మకం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వెంకటేష్‌ ఓ గెస్ట్‌ రోల్‌ చేయనున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆగష్టులో విడుదల కానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments