యువ హీరో అక్కినేని నాగచైతన్యకు సినిమాల కంటే బైక్స్ అంటేనే మహా క్రేజ్. మార్కెట్లో వచ్చే కొత్త బైక్స్ గురించి చైతూ ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూనే ఉంటాడు. తాజాగా ఆయన ట్రియూంప్ కంపెనీ నుంచి ఈ మధ్యే వచ్చిన "థ్రక్స్‌టన్ ఆర్'' అనే మోడల్ బైక్‌ను కొనుగోలు చేశారు. హైద్రాబాద్‌లోని ట్రియూంప్ షోరూమ్‌లో రెండు రోజుల క్రితం చైతన్య ఈ బైక్‌ను కొన్నారు.
ఇదే విషయాన్ని తెలియజేస్తూ షోరూమ్ నిర్వాహకులు థ్రక్స్‌టన్ ఆర్ స్పెషల్ కస్టమర్‌గా చైతన్య రావడం తమ కంపెనీకి ఆనందంగా ఉందన్నారు. ఈ బైక్ ఖరీదు ఎంతో తెలుసా... సుమారు 11 లక్షల రూపాయలు. ఖరీదైన (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధర) ఈ బైక్ యూత్‌కి అన్ని విధాల సౌకర్యంగా ఉంటుంది. బైక్ కొన్న వెంటనే చైతూ దానిపై ఓ రైడ్‌కు వెళ్ళారు.
ఖరీదైన బైక్ సొంతం చేసుకున్న చైతన్య దానిపై సమంతతో ఎప్పుడు రైడ్‌కి వెళ్తాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇంకా చైతూ సినిమాల విషయానికి వస్తే…. ఆయన నటించిన ''సాహసం శ్వాసగా సాగిపో'', ''ప్రేమమ్'' సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.