Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sai Pallavi :హైలెస్సో హైలెస్సా అంటూ ప్రేమలో జీవించిన నాగ చైతన్య, సాయి పల్లవి

డీవీ
శుక్రవారం, 24 జనవరి 2025 (07:47 IST)
Naga Chaitanya and Sai Pallavi
తండేల్ నుంచి హైలెస్సో హైలెస్సా అంటూ లవ్ సాంగ్ గత రాత్రి రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి జీవించారనే టాక్ వచ్చేసింది. హైలెస్సో హైలెస్సా సాంగ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ షిప్ ని, ఎదురుచూపులని, నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఉన్న అనురాగాన్ని  అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది
 
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్, హృదయాన్ని తాకే మరొక లవ్ మెలోడీని కంపోజ్ చేశారు. శ్రేయ ఘోషల్, నకాష్ అజీజ్ వోకల్స్ మెలోడీని మరింత ఎలివేట్ చేశాయి. శ్రీమణి లిరిక్స్ విడదీయరాని ప్రేమని చాలా గొప్ప ప్రెజంట్ చేశాయి.
 
సాయి పల్లవి, నాగ చైతన్య కెమిస్ట్రీ  బ్యూటీఫుల్ గా వుంది. నాగ చైతన్య రగ్గడ్  లుక్ లో అదరగొట్టారు, సాయి పల్లవి ఎలిగెంట్ గా తన  క్లాసిక్ డ్యాన్స్ మూమెంట్స్ తో కట్టిపడేసింది. ఈ ఇద్దరి జోడి అద్భుతంగా వుంది. అద్భుతమైన విజువల్స్,  వోకల్స్, కంపోజిషన్ తో ఈ పాట బ్లాక్ బస్టర్ లవ్ సాంగ్ గా నిలిచింది.
 
'తండేల్'కు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. మొదటి రెండు పాటలు బుజ్జి తల్లి, నమో నమః శివాయ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత మేకర్స్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన థర్డ్ సింగిల్ హైలెస్సో హైలెస్సాను విడుదల చేశారు.
 
శ్యామ్‌దత్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు, నేషనల్ అవార్డ్ విన్నర్  నవీన్ నూలి ఎడిటర్‌గా, శ్రీనాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments