Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగార్రాజుతో వాళ్ళిద్దరూ కూడా నటిస్తున్నారట?

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (17:52 IST)
అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్. అదేంటో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. తండ్రితోపాటు, తనయులిద్దరూ తెరను పంచుకోనున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కాంబినేషన్‌లో అక్కినేని కుటుంబం అంతా మనం సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 2014లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
 
అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్ రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ నటించనున్నారని సమాచారం.
 
నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్నినాయన' సినిమా విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్‌ తర్వాత దానికి సీక్వెల్‌గా రాబోతోందని వార్తలొచ్చాయి. ఆ సినిమాలోని 'బంగార్రాజు' పాత్రనే ఆధారంగా చేసుకొని కళ్యాణ్‌ కృష్ణ కథను సిద్ధం చేశారని... ఇందులో నాగార్జున నటించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
 
అయితే ఈ సినిమాలో నాగార్జునే కాకుండా.. నాగచైతన్య కూడా నటిస్తారని వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం నాగచైతన్యతోపాటు, అఖిల్‌ కూడా నటించనున్నారని సమాచారం. ఇప్పటికే.. 'వైల్డ్ డాగ్' సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న నాగ్.. త్వరలో బంగార్రాజుపై నాగ్ దృష్టిసారించారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌.. రిపేర్ చేసినందుకు రూ.90వేలు బిల్లు.. అంతే విరగ్గొట్టేశాడు..! (video)

శ్రీరాముని వేలు విరిగింది.. బంగారుపూతతో మరమ్మత్తులు చేశాం.. టీటీడీ

సింగపూర్‌తో వైకాపా తెగతెంపులు.. ఏం జరిగిందో కనుక్కోండి.. బాబు

నవంబర్ 29న ఘనంగా దీక్షా దివస్‌.. కేటీఆర్ పిలుపు

గడ్డం, మీసంతో కనిపించిన అఘోరీ.. చేతిలో నిమ్మకాయలు.. ఏం చేస్తోంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments