Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్య అక్కినేని, సాయి పల్లవి జంటగా తండేల్ ముహూర్తం వేడుక

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2023 (14:39 IST)
Clap by venatesh
నాగ చైతన్య అక్కినేని, దర్శకుడు చందూ మొండేటి గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్న క్రేజీ ప్రాజెక్ట్ 'తండేల్' కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. నాగ చైతన్య కు హయ్యస్ట్  బడ్జెట్ చిత్రమైన 'తండేల్' ఈరోజు గ్రాండ్ ముహూర్తం వేడుకను జరుపుకుంది. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌, పలువురు సినీ ప్రముఖులు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.
 
Nagarjuna Camera Switchon
ముహూర్తం షాట్‌కు నాగార్జున కెమెరా స్విచాన్ చేయగా, వెంకటేష్ క్లాప్ ఇచ్చారు. అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు.  
 
అనంతరం  అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించి ఎప్పుడూ ప్రోత్సహిస్తున్న ప్రేక్షకదేవుళ్ళకు నమస్కారం. ఈ ప్రయత్నం ఏడాదిన్నరగా  మొదలుపెట్టాం. ఈ రోజు సినిమా ప్రారంభోత్సవం జరగడం చాలా ఆనందంగా వుంది. మా హీరో, దర్శకుడు ఎప్పుడు షూటింగ్ అనే కంగారు లేకుండా, ఈ కథని మనం అనుకున్న స్థాయిలో అద్భుతంగా చూపించాలనేదానిపై ప్రత్యేక ద్రుష్టిపెట్టారు. ఈ కథని ఒక వరల్డ్ లోకి తీసుకెళ్ళి చూపించాలి. ఆ వరల్డ్ క్రియేట్ చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఒక సినిమా హిట్ అయితే దర్శకుడికి చాలా అవకాశాలు వస్తాయి. కానీ ఎన్ని ఆఫర్లు వచ్చినా ఇచ్చిన కమిట్మెంట్ కోసం గీతా ఆర్ట్స్ లోనే సినిమా చేయాలని నిర్ణయించుకొని, ఈ కథకు నాగచైతన్య సరిపోతారని ఆయన్ని దగ్గరకి తీసుకెళ్ళినపుడు ఆయన ఎక్సయిట్ అయ్యారు. నాగచైతన్యకు సరైన జోడిగా మా బంగారు తల్లి సాయిపల్లవి వచ్చారు. ఈ మధ్య సినిమాని పెద్దగా చూడటం అలవాటైయింది. అలాగే  పెద్దగా తీయాలి, పెద్దగా రిలీజ్ చేయాలి. ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమైనపుడు పాన్ ఇండియా సౌండ్ అలవాటు చేసిన దేవిశ్రీ ప్రసాద్ రావడం, ఆలాగే అద్భుతమైన కెమరామ్యాన్ షామ్‌దత్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇలా అద్భుతమైన టీంతో ఈ ప్రాజెక్ట్ నిర్మించడం చాలా అనందంగా వుంది. ఈ కథని భాను రియాజ్ కార్తిక్ మా వద్దకు తీసుకొచ్చారు, నిజంగా జరిగిన కథ ఇది. ఇలాంటి కథ గీతా ఆర్ట్స్ లో తీస్తే బావుటుందని వాసు దగ్గరకి తీసుకొచ్చారు. ప్రీప్రొడక్షన్ వర్క్ లో టీం అంతా కూర్చొని ప్రతి విషయాన్ని చర్చించుకున్నపుడు చాలా సంతోషంగా అనిపించింది. సినిమాని ఇలా తీయాలి కదా అనే తృప్తి వచ్చింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా వచ్చి టీంని అభినందించిన నాగార్జున గారు, వెంకటేష్ గారికి ధన్యవాదాలు’ తెలిపారు.  
 
దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ.. ఏడాదిన్నరగా కథపై వర్క్ చేశాం. వాసు గారు అరవింద్ గారు అద్భుతంగా ప్రోత్సహించారు. నాగచైతన్య గారు, సాయి పల్లవి గారు, మిగతా టెక్నిషియన్స్ అందరూ బెస్ట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. వాళ్ళంతా నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళతో కొలబరేట్ అయ్యి నా బెస్ట్ ఇస్తాను’’ అన్నారు
 
సాయి పల్లవి మాట్లాడుతూ.. దర్శకుడు రచయిత నిర్మాతలు అందరికీ ఈ సినిమా పట్ల ఒక విజన్ వుంది. ఆ విజన్ మీ అందరికీ సరిగ్గా చేరుతుందని ఆశిస్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్ కావాలి ’’అని కోరారు  
 
హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. ఏడాదిన్నరగా ఈ కథతో ట్రావెల్ అవుతూవస్తున్నాం. ప్రీప్రొడక్షన్ లో ప్రతి అడుగుని చాలా ఎంజాయ్ చేశాను. చాలా కొలబరేటివ్ గా పనులు జరిగాయి. శ్రీకాకుళం వెళ్లి మత్స్యకార కుటుంబాలని కలవడం, చందూ, నేను కథ పై చర్చించడం,  శ్రీకాకుళం యాసపై వర్క్ అవుట్ చేయడం ఇలా చాలా విషయాలపై ప్రత్యేక ద్రుష్టితో పని చేశాం. ఏ సినిమాకి ఇంత ప్లానింగ్ తో ముందుకు వెళ్ళలేదు. ఈ ప్రోసస్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాను. ఇది ప్రతి సినిమాలా కాదు చాలా ప్రత్యేకమైనదని, బలమైన కథ,  కావాల్సిన సమయం తీసుకొని పక్కాగా ప్లాన్ చేసుకొని వెళ్దామని అరవింద్ గారు ముందు నుంచి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. కథకు కావాల్సిన బడ్జెట్, సపోర్ట్ ఇస్తున్న అరవింద్ గారికి ధన్యవాదాలు. నా కెరీర్ లో గుర్తుండిపోయే సక్సెస్ 100% లవ్ అరవింద్ గారే ఇచ్చారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆయన నిర్మించడం చాలా ఆనందంగా వుంది.  అలాగే వాసు గారికి ధన్యవాదాలు. చందూ దర్శకుడిగా కంటే నాకు మంచి స్నేహితుడు. తనతో ప్రతి విషయాన్ని ఓపెన్ గా చర్చించగలుగుతాను. మా ఇద్దరం కలసి చేస్తున్న మూడో సినిమా ఇది. సాయి పల్లవి చాలా పాజిటివ్ ఎనర్జీ వున్న యాక్టర్. తను ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది.  దేవిశ్రీ ప్రసాద్ గారు, షామ్‌దత్, శ్రీనాగేంద్ర ఇలా అద్భుతమైన టీం ఈ చిత్రానికి పని చేస్తుంది. డిసెంబర్ 15 తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి’ అని కోరారు.
 
నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఇది గీతాఆర్ట్స్ కి చాలా ప్రత్యేకమైన స్క్రిప్ట్. ఇంత రీసెర్చ్ ఏ సినిమాకి జరిగుండదు. ఈ కథకు సంబధించిన ప్రతి అంశాన్ని చాలా లోతుగా వెళ్లి క్యాప్చర్ చేయడంలో టీం చాలా ఎఫర్ట్ పెట్టింది. మూడేళ్ళ క్రితం ఈ స్క్రిప్ట్ గీతా ఆర్ట్స్ కి వచ్చింది. అప్పటి నుంచి కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ఏడాదిన్నరగా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చందు గారు కథని అద్భుతంగా మలిచారు. ఆయనకి హ్యాట్సప్ చెప్పాలి. ఆయన్ని దూత షూటింగ్ లో కలిసినప్పుడు ఈ కథ గురించి మాట్లాడటం జరిగింది. అయితే ఇది ఫిషర్ మ్యాన్ క్యారెక్టర్. దినికి చైతుగారి స్కిన్ టోన్ తో పాటు అన్నీ ఎలా కుదురుతాయో అనే ఆలోచన వుండేది. అయితే తండేల్ ఫస్ట్ లుక్ చూసి ఆడియన్స్ తో పాటు నేను షాక్ అయ్యాను. ఒక నటుడు ఒక పాత్రని బలంగా నమ్మి చేస్తే ఎలా వుటుందో అర్ధమైయింది. పోస్టర్ చూసిన తర్వాత వచ్చిన నమ్మకం, సంతోషం మాటల్లో చెప్పలేను. నాగచైతన్య గారి హార్డ్ వర్క్ కే హ్యాట్సప్. దీనికి చైతు గారు 200 పర్సెంట్ ఇస్తున్నారు. దిని రిజల్ట్ కూడా అంత బావుటుంది. సాయి పల్లవి గారికి రెండేళ్ళ క్రితం కథ చెప్పాం. వారి ఇన్పుట్స్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి. చందూ అద్భుతమైన క్యాలిటీతో ప్రోడక్ట్ ని ఇస్తారు. ఆయన గత చిత్రాలకు మించి ఈ చిత్రాన్ని చేయడానికి అరవింద్ గారు మేము మా తోడ్పాటు అందిస్తాం’’ అన్నారు
 
నాగ చైతన్య ఈ చిత్రంలో మత్స్యకారునిగా నటించడానికి బీస్ట్ మోడ్‌కి మారారు. కండలు తిరిగి దేహం కోసం గత కొన్ని నెలలుగా చాలా హార్ట్ వర్క్ చేశారు.  పొడవాటి జుట్టు,  గడ్డంతో రగ్గడ్ లుక్ లో కనిపిస్తారు.  
 
యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఒరిజినల్ లొకేషన్లలోనే జరగనుంది. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా సాయి పల్లవి నటిస్తున్నారు. సూపర్‌హిట్ 'లవ్ స్టోరీ' తర్వాత ఇది వారి రెండవ చిత్రం. 'తండేల్' కూడా పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమకథ.
 
కథలో సంగీతానికి మంచి స్కోప్ ఉన్నందున, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సౌండ్‌ట్రాక్‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రేమకథను అందంగా తీర్చిదిద్దుతున్నారు. విజువల్ వండర్ ని అందించడానికి షామ్‌దత్ కెమెరామ్యాన్ గా పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఎడిటర్ గా పని చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments