Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిగర్ సంఘం ఎన్నికల స్టంట్... విశాల్.... నీ అంతుచూస్తాం, బెదిరింపులు

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2015 (17:41 IST)
నడిగర్ సంఘం ఎన్నికల వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. మొన్నటివరకూ ఒకరికొకరు విమర్శలదాడి చేసుకున్నారు. ఇప్పుడు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పాండవర్ జట్టు ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న నటుడు విశాల్ ను బెదిరిస్తూ ఫోన్లు చేస్తున్నారు. విశాల్ ను హతమారుస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడంతో విశాల్ కార్యాలయ మేనేజర్ మురుగరాజ్ చెన్నై అన్నానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఫిర్యాదు అందుకున్న పోలీసులు బెదిరింపు కాల్స్ చేసిన నెంబర్ల ఆధారంగా ఆ వ్యక్తుల కోసం గాలింపు మొదలుపెట్టారు. మరోవైపు విశాల్ ఇంటివద్ద, ఆఫీసు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మఫ్టీలోనే పోలీసులు విశాల్ ఇంటి వద్ద నిఘా పెట్టి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నడిగర్ సంఘం ఎన్నికలు వచ్చే ఆదివారం... అంటే అక్టోబరు 18న జరుగనున్నాయి. అక్టోబరు 11న ఫిట్టింగ్ రిప్లై ఇస్తానన్న శరత్ కుమార్ ఎలాంటి రిప్లై ఇవ్వలేదు కానీ బెదిరింపు కాల్స్ మాత్రం నటుడు విశాల్‌కు వచ్చాయి.

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments