Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. డైలాగ్ ఎంపాక్ట్ రిలీజ్ (వీడియో)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ తాజా సినిమా ''నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా''. ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాలోని ఓ డైలాగును బన్నీ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేశారు.

Webdunia
ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (17:08 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ తాజా సినిమా ''నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా''. ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాలోని ఓ డైలాగును బన్నీ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేశారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. పలు సక్సెస్ చిత్రాలకు కథలందించిన వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 
 
మే 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. ఇంకా సినిమాపై భారీ అంచనాలను పెంచింది. బన్నీ డిఫరెంట్‌ మేకోవర్‌లో డిఫరెంట్ బాడీ లాంగ‍్వేజ్‌తో ఆకట్టుకుంటున్న ఈ సినిమాతో మరోసారి రికార్డులను తిరగరాస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం (ఏప్రిల్ 8) అల్లు అర్జున్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలోని డైలాగ్‌ ఇంపాక్ట్‌‌ను రిలీజ్ చేశారు. 
 
ఈ సీనులో విలన్‌ ''సౌత్ ఇండియాకా సాలా'' అంటే బన్నీ ''సౌత్ ఇండియా.. నార్త్‌ ఇండియా.. ఈస్ట్.. వెస్ట్‌.. అన్ని ఇండియాలు లేవురా మనకి ఒక్కటే ఇండియా'' అంటూ బన్నీ చెప్పిన డైలాగ్‌ అదుర్స్ అనిపించింది. ప్రస్తుతం ఈ డైలాగ్‌తో కూడిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments