సోనూసూద్‌కు ఫన్నీ ట్వీట్.. నా భార్య రక్తం తాగుతోంది.. చికిత్స వుందా?

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2022 (14:16 IST)
బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌కు ఫన్నీ ట్వీట్ వచ్చింది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ సమయంలో ఎంతోమంది వలస కార్మికులు, కూలీలకు సాయం అందించిన సోనూకు ఫన్నీ ట్వీట్ వచ్చింది. 
 
ఇటీవల ఓ బాలుడికి సోనూ ఫౌండేషన్ ద్వారా హార్ట్ సర్జరీ చేయించారు సోనూ సూద్‌. ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆ బాలుడి కుటుంబ సభ్యులు ఆయనకు ట్వీటర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఇది చూసిన ఓ నెటిజన్ సోనూకు ఫన్నీ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
 
"సోదరా సోనూసూద్‌ మీరు అందరికీ చికిత్స అందేలా చేస్తున్నారు. నా భార్య రోజూ నా రక్తం తాగుతోంది. దానికి ఏదైనా చికిత్స ఉందా? ఉంటే దయచేసి సహాయం చేయండి. ఒక భార్య బాధితుడిగా చేతులు జోడించి మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను" అంటూ ట్వీట్ చేశాడు. 
 
దీనికి సోనూ సూద్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. "అది ప్రతీ భార్య జన్మ హక్కు బ్రదర్.. ఆ రక్తంతో నాలాగే మీరు కూడా బ్లడ్ బ్యాంకు ప్రారంభించండి" అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: మనం కోరుకుంటే మార్పు జరగదు.. మనం దాని కోసం పనిచేసినప్పుడే మార్పు వస్తుంది..

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments